logo

  BREAKING NEWS

139 మంది అత్యాచారం కేసులో వెలుగులోకి ‘డాలర్ బాయ్’ అకృత్యాలు..

పంజాగుట్టలో 139 మంది అత్యాచారం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును సీసీఎస్‌కి బదిలీ చేశారు. బాధితురాలు ఆరోపిస్తున్న139 మందిలో ఎవరు నిందితులు, ఎవరు బాధితులు అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో డాలర్ బాయ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో బాధితురాలికి సంబందించిన ఆడియో టేపులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో డాలర్ బాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బాధితురాలి పేరుతో రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టగా ఇతని గుట్టంతా బయటకు వచ్చింది. ఇతగాడిపై పొరుగు జిల్లాల్లో కూడా అనేక కేసులు నమోదైనట్టుగా పోలీసులు గుర్తించారు.

ఉద్యోగాల కోసం ఇతర నగరానికి వచ్చే అమాయకపు యువతులు ఇతని టార్గెట్. కన్సల్టెన్సీ యాడ్ ఏజెన్సీ పేర్లతో వారిని మొదట ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారినుంచి ఒరిజినల్ సెర్టిఫికెట్లను సేకరిస్తారు. ఆ తర్వాత ప్రేమ , పెళ్లి పేరుతో వారిని లోబరుచుకుంటాడు. ఇతని మాటలు నమ్మిన కొందరు యువతులు ఏకంగా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఆ తరవాత నిజస్వరూపం తెలిసి నిలదీసిన ఎలాంటి ఫలితం లేకపోగా విద్యార్హత సెర్టిఫికెట్లను దగ్గర ఉంచుకుని బెదిరించడం, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడం చేస్తాడు.

ఆ తర్వాత ఇలా అత్యాచారం రొంపిలోకి దింపుతుంటాడు. 2018 లోనే ఇతని వల్ల మోసపోయిన ఎంతో మంది యువతులు మహిళా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసారు. అయితే తాజాగా పంజాగుట్ట అత్యాచారం కేసులో కూడా ఇతని ప్రమేయం గుర్తించారు. 139 మందికి ఈ డాలర్ బాయ్ ఫోన్లు చేసి బెదిరించినట్టుగా తెలుస్తుంది. వారిని డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Related News