logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

టాయిలెట్ వాటర్ తో స్పెషల్ పానీపూరి.. చితకబాదిన జనాలు

పానీ పూరీని ఇష్టపడనివారుండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఇది చాలా ఇష్టమైన చిరుతిండి. అయితే ఇప్పుడు చదివే వార్త వింటే మాత్రం ఇంకోసారి పానీపూరి తినాలంటే భయపడతారు. ఓ పానీ పూరి బండివాడు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న పాలలో కల్తీ నీటిని కలిపిన వార్త చదివే ఉంటారు.

ఇప్పుడు టాయిలెట్ లో ఉండే నీటిని తెచ్చి పానీ పూరికి ఉపయోగించే నీటిలో కలిపాడు ఓ వ్యక్తి. అది గమనించిన స్థానికులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారుతుంది. అంతేకాదు రోజు ఈ బండి దగ్గర ఆవురావురుమంటూ పానీపూరి తినే వారంతా వచ్చి ఆగ్రహంతో ఊగిపోయారు. చెరో చేయి వేసి వస్తువులన్నీ ధ్వంసం చేసారు.

ఆ బండిని నామరూపాలు లేకుండా చేశారు. ఇలాంటి పాడుపని చేసినందుకు బండివాడికి దేహశుద్ది చేసి వదిలేసారు. ఈ ఘటన కొల్హాపూర్ లో చోటుచేసుకుంది. ‘ముంబై కా స్పెషల్ పానీపూరి సెంటర్’ పేరుతో విక్రయిస్తున్న వ్యక్తి ఇలా దగ్గర్లో ఉన్న టాయిలెట్ లో ఉండే వాటర్ ను తెచ్చి పానీపూరి రసంలో కలిపాడు. ఇప్పటికైనా రోడ్డు పక్కన చిరుతిళ్ళు తినేవారు కాస్త అప్రమత్తంగా ఉంటె మంచిది.

Related News