logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

భాగ్యనగర వాసులకు శుభవార్త: పంచతత్వ పార్కు ప్రారంభం.. ప్రత్యేకతలివే!

ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రముఖ జోన్లలో పంచతత్వ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టుగా మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ. 16 లక్షలతో నగరంలోని ఇందిరా పార్కులో మొదటి పంచతత్వ పార్కును ఏర్పాటు చేసారు.

మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌‌, నగర మేయర్‌ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొన్నారు. ఈ పార్కులను జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. ఈ పార్కులో మొత్తం 50 రకాల ఔషధ మొక్కలను నాటారు. నగరవాసుల కోసం ఓ ప్రత్యేకమైన వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు.

ఈ ట్రాక్ ను కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించారు. అక్యు ప్రెజర్ థెరపీ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎనిమిది అంశాలతో కూడిన ఈ ట్రాక్ పై నడిస్తే ఇందులో ఉన్న పదార్థాల కారణంగా నరాలపై ఒత్తిడి పడుతుంది. ట్రాక్ మొదట భాగంలో నడిస్తే అధిక ఒత్తిడి కలిగిస్తుంది. ఆ తర్వాత క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవాలి. దీంతో శరీరంలో రక్తప్రసరణలో మార్పులు జరిగి ఎన్నో రకాల అనారోగ్యాలు నయమవుతాయని పేర్కొన్నారు.

Related News