logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా తర్వాత టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల పై చర్చ మొదలైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాకు తెలుగు ప్రేక్షుకుల కంటే ఉత్తరాది నుంచే మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా సినిమాకు మార్కెట్ కూడా బాగుండటంతో ఇప్పుడు టాలీవుడ్ బడా హీరోలంతా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు అదే తరహాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ‘పుష్ప’ సినిమాలో బన్నీనటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతుందని వార్తలు ఎప్పటి నుండో వినిపిస్తున్నా ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు.

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం కొరటాల బన్నీకి కథ వినిపించాడని, అందుకు సంబందించిన చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కొరటాల గత సినిమాల మాదిరిగానే సామజిక సందేశాన్ని జోడించి ఉంటుందని అందుకే ఈ సినిమాకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తవ్వగానే కొరటాల ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడట. ఈ సినిమాను బారి బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Related News