logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ అయ్యిందా? రెండు నిమిషాల్లో ఇలా తెలుసుకోండి లేదంటే రూ. 1000 ఫైన్

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ కోసం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. రూ.50,000 కన్నా ఎక్కువ లావాదేవీలకు కూడా తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలి. మారిన కొత్త రూల్స్ ప్రకారం మార్చి 31 లోపు ప్రతి ఒక్క వినియోగదారుడు పాన్ కార్డుతో ఆధార్ ని లింక్ చేసుకోవాలి.

గడువులోగా ఈ పని చేయని వారు రూ. 1000 జరిమానా కట్టవలసి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికె ఈ పని చేసిన వారు ఆధార్ తొ పాన్ లీక్ అయ్యిందా లేదా అనే విషయాన్నీ రెండు నిమిషాల్లో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్నీ రెండు విధాలుగా తెలుసుకోవచ్చు.

ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ కు వెళ్ళాలి.
హోమ్ పేజీలో ”లింక్ ఆధార్” పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీరు ఇదివరకే పాన్ తో ఆధార్ లింక్ చేసినట్లయితే ఆ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ”క్లిక్ హియర్” అనే లింక్ కనిపిస్తుంది.
ఈ లింక్ ఓపెన్ చేసి ”పాన్” అని ఉన్న దగ్గర పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అని ఉన్న దగ్గర ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
ఓసారి మీరు ఎంటర్ చేసిన నంబర్లను సరి చూసుకోండి.
ఆ తర్వాత ”వ్యూ లింక్ ఆధార్ స్టేటస్” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఇక్కడ కొత్త పేజీలో యువర్ పాన్ ఈజ్ లింకుడ్ తో ఆధార్ నెంబర్ అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయినట్టే. ఏ ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయిందో ఇక్కడ కూడా తెలుస్తుంది.
ఈ మెసేజ్ లో ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.

మరో విధంగా మీ మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ చేసి కూడా మీ పాన్ ఆధార్ లింక్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ లో UIDPAN అని టైపు చేసి 12 సంఖ్యల ఆధార్ నంబర్, పాన్ నంబర్ ను టైపు చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

Related News