logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

అయోధ్యలో హై అలెర్ట్: ఏడాది తర్వాత అదే రోజు దాడులకు కుట్ర

ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామమందిరం నిర్మాణం సందర్భంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్ర నేతలు ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమా భారతి తదితర నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో పాకిస్థాన్ ఐఎస్ఐ భారీ ఉగ్ర దాడులకు పథకం వేస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్యలో హై అలెర్ట్ ప్రకటించారు. అయోధ్యతో పాటుగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ నగరాల్లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. అనుమానిత ప్రాంతాలన్నిటిలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రామ్ కోట్ నివాసితులందరికీ ప్రత్యేక పాసులను జారీ చేసి అనుమతిస్తున్నారు. ప్రధాని ఛాపర్ దిగే ప్రాంతం నుండి అయోద్య వరకు భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.

కాగా గతేడాది ఆగస్టు 5వ తేదీనే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతి పత్తిని రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఏడాది తర్వాత ఆగస్టు 5వ తేదీనే కీలకమైన రామ మందిర నిర్మాణనైకి భూమి పూజ నిర్వహిస్తుండటంతో ఆ రోజు అయోధ్యలో దాడులకు ఐఎస్ఐ కుట్ర పన్నినట్టుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.

Related News