logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

అతనికి 20 ఏళ్లకే మూడు పెళ్లిళ్లు.. దగ్గరుండి నాలుగో పెళ్లి చేయిస్తున్న భార్యలు!

ఈరోజుల్లో ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నామని వాపోతుంటారు భర్తలు. కానీ ఓ యువకుడు 20 ఏళ్లకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా నాలుగో పెళ్ళికి కూడా సిద్దమయ్యాడు. విచిత్రం ఏమిటంటే తమ భర్తకు నాలుగో భార్యగా వచ్చేందుకు ఓ యువతి కావాలంటూ అతని ముగ్గురు భార్యలే ఓ ప్రకటన ఇచ్చారు.

అందులో కొన్ని షరతులు కూడా పెట్టారు. ఏమిటంటే ఆ అమ్మాయి పేరు ఎస్ తోనే మొదలవ్వాలంట. ఆ అమ్మాయి, తమ భర్త పెళ్ళికి ముందు కలిసి మాట్లాడుకోవాలట. ఈప్రకటన చూసిన భార్యాబాధితులంతా అతని ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ కు చెందిన అద్నాన్ కు 16 ఏళ్లకే మొదటి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.

ఆ తర్వాత నాలుగేళ్లకు.. అంటే 20 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు సంతానం. గతేడాది మూడో పెళ్లి చేసుకోగా ఆమె ఒకరిని దత్తత తీసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో భార్య కోసం వెతుకుతున్నారు. ఇలా ఎందుకంటే అద్నాన్ కు పెళ్లి చేసుకున్న ప్రతి సారీ అతని ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అని చెప్తున్నాడు.

ఇప్పుడు ఈ ముగ్గురు భార్యల పోషణకు కూడా నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చుచేస్తాడట. అయితే వీరంతా ఒకే ఇంట్లో కలిసే ఉండటం విశేషం. ఆరు బెడ్ రూమ్ లు, ఒక స్టోర్ రూమ్, హాల్, కిచెన్ ఉన్న ఇంట్లో వీరు ఉంటున్నారు. తమ భర్త ఎవరితో గడిపినా మిగిలిన భార్యలకు ఎలాంటి అభ్యంతరం ఉండదట.

అది పూర్తిగా భర్త ఇష్టానికే వదిలేస్తారట. ఇక అద్నాన్ మాట్లాడుతూ తమ భార్యలు అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పుకొచ్చాడు. అయితే తమతో ఎక్కువ సమయం గడపడని వారి ఏకైక ఫిర్యాదు. తనకు నాలుగో భార్యగా వచ్చే అమ్మాయి పేరు ‘ఎస్’ అక్షరంతో మొదలవ్వాలి అప్పుడు మొదటి ముగ్గురు భార్యలైన షుంబాల్, షుబానా, షాహిదాతో కలుస్తుందని కోరుకుంటున్నాడు.

Related News