logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

కరోనా భయంతోనే కుప్పకూలిన విమానం..!

పాకిస్థాన్ ఇంటర్ నేషనల్ ఎయిర్లైన్స్ ఎ320 విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మే నెల 22 న పాకిస్థాన్ లోని కరాచీలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం జనావాసాల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో ఏకంగా 97 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మొదట ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని, ఇంధనం అయిపోవడం వల్లే ప్రమాదం సంభవించింది అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఈ ప్రమాదంపై పాకిస్తాన్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌ పార్లమెంటులో నివేదికను సమర్పించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇద్దరు పైలట్ల నిర్లక్ష్యమే వారితో పాటు ఇన్ని కుటుంబాల్లో విషాదం మిగిల్చిందని వ్యాఖ్యానించారు. లాహోర్‌ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్‌ బస్‌ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు 15 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అయితే తాను హ్యాండిల్ చేయగలలనని పైలట్ నిర్లక్యంగా వ్యవహరించాడు. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు కరోనా కు సంబందించిన చర్చల్లో మునిగిపోయారు. వారికి కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో విమానం గమ్యంపై దృష్టి పెట్టలేకపోయారు. అప్పటికే ఏటీసీ అధికారులు పైలట్లకు మరో రెండు సార్లు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.

అప్పుడు కూడా ‘ఏం పర్వాలేదులే’ అని వ్యాఖ్యానించిన పైలట్ మళ్ళీ కో పైలట్ తో కరోనా గురించిన చర్చల్లో మునిగిపోయాడు. ఇదంతా విమానంలోని కాక్ పిట్ లో వేవ్స్ రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పైలట్లదే అని నివేదికలో పేర్కొన్నారు.

Related News