logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కారుకు ప్రమాదం!

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ కారు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కుగా మారింది. కాగా షోయబ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

లాహోర్‌లో జాతీయ రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ విషయాన్నీ షోయబ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగింది. భగవంతుడి దయవల్ల నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

Related News