logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. ఈ దశలో ప్రతి వంద మందిలో 30 మంది కరోనా బారిన పడుతుండగా అందులో ఐదుగురికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో పలు చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కోవిడ్ రోగుల పాలిట వరంగా మారుతున్నాయి.

సాధారణంగా ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నవారికి, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు వాడుతుంటారు. అవసరం ఉన్నవారు వీటిని ఇంట్లోనే పెట్టుకుంటారు. కొన్ని చిన్న ఆసుపత్రులు కూడా వీటిని వినియోగిస్తుంటాయి. అయితే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఎంతోకాలంగా మనకు అందుబాటులో ఉన్నవే. కానీ కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పుడు వీటికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ సిలిండర్లకు ప్రత్యామ్న్యాయంగా వీటిని వాడుతున్నారు.

నాజల్ కాన్యులా లేదా ఆక్సిజన్ మాస్కుల ద్వారా సిలిండర్ల నుంచి ప్రాణవాయువును అందిస్తుంటారు. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులోకి రావడంతో మరింత సౌకర్యంగా కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ ను అందిస్తున్నారు. అచ్చం ఆక్సిజన్ సిలిండర్లలాగానే కాన్సన్‌ట్రేటర్లు కూడా ఆక్సిజన్ ను రోగులకు అందిస్తాయి. అయితే సిలిండర్ల మాదిరిగా వీటిలో ఆక్సిజన్ అయిపోదు. ఇవి నిరంతరం ఆక్సిజన్ ను సరఫరా చేయగలవు.

చూడటానికి బ్రీఫ్ కేసుల్లా, వాటర్ ప్యూరిఫయర్ లాగా కనిపించే ఈ మెషీన్లు మన చుట్టూ ఉండే గాలి నుంచి ఆక్సిజన్ ను సేకరించి దానిని ఫిల్టర్ చెస్ గాఢతను పెంచుతాయి. అందుకే వీటిని కాన్సన్‌ట్రేటర్లు అని పిలుస్తారు. వీటిని ఉపయోగించడం వల్ల రోగులకు ప్రాణ వాయువు నిలిచిపోతుందనే భయం ఉండదు. అయితే టెక్నాలజీ ఏదైనా అందులో కొన్ని లోపాలు ఉండటం సహజమే. ఈ మెషీన్లు కరెంటు, బ్యాటరీల ద్వారా పని చేస్తాయి. కాబట్టి కరెంటు లేని సమయంలో వీటిని ఉపయోగించలేము.

అలాగే ప్రస్తుతం ఈ మెషిన్లకు ఉన్న డిమాండును బట్టి మార్కెట్లో వీటి ధర రూ. 40 నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది. ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి. సిలిండర్లలో ఉండే ఆక్సిజన్ 99 శాతం స్వచ్ఛంగా ఉంటె కాన్సన్‌ట్రేటర్లలో ఒక నాలుగు శాతం తక్కువ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ బారిన పడిన వారికి ఇవి ఎంతో ఊరటనిచ్చే అంశంగా వైద్యులు చెప్తున్నారు.

 

Related News