logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

శరీరంలో ఆక్సిజన్ తగ్గితే కరోనా ముప్పు?.. ఇవి తెలుసుకోండి!

కరోనా శ్వాసకోశ వ్యాధి అని తెలిసిందే. ఈ వైరస్ ముఖ్యంగా మన శరీరంలోని ఊపిరితిత్తుల్లో చేరి అక్కడ తిష్టవేసుకుని కూర్చుంటుంది. అప్పుడు శరీరంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గుతాయి. ఎవరికైనా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నా అనారోగ్యం ఉన్నా వారికి ఈ వైరస్ నుంచి కొంత ప్రమాదమని వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సోకితే వారికి శరీరంలోకి ఆక్సిజన్ అందదు. శ్వాస తీసుకొవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే వీరికి వెంటిలేటర్లపై వైద్యం అందిస్తారు. 80 శాతం రోగులకు కరోనా లక్షణాలు బయటకు కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఈ లక్షణాలను పరీక్షించేందుకు కోవిడ్ పరీక్షలతో పాటుగా అనేక పద్దతులను గుర్తించారు. అందులో కరోనా లక్షణాలను సులువుగా గుర్తించే విధంగా డిజిటల్ పలాక్సీ మీటర్లను రూపొందించారు. ఇవి మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిల హెచ్చుతగ్గులను డిగ్రీలలో నమోదు చేస్తాయి. ఇవి మార్కెట్లో సులువుగా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా వీటి ద్వారా ఇంటి వద్దనే పరీక్ష చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులతో పాటుగా కరోనా సోకుతుందేమోనన్న అనుమానం ఉన్న వారిని కూడా ఈ ఆక్సిజన్ సమస్య ఆందోళనకు గురి చేస్తుంది.

అయితే దీనిపై ఆందోళన అవసరం లేదంటున్నారు వైద్యులు. సాధారణంగా ఆరోగ్యాంగా ఉన్న వ్యక్తుల శరీరంలో 95 శాతం వరకు ఆక్సిజన్ నిల్వలు ఉంటాయి. కొన్ని సార్లు వీటిని పరీక్షించినప్పుడు 90 శాతం ఉన్నా కూడా ప్రమాదమేమీ లేదంటున్నారు. అయితే 85 శాతం తగ్గితే మాత్రం కచ్చితంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా గుర్తించాలని వెంటనే వైద్యులను స్పరదించాలంటున్నారు. 60 ఏళ్ళు దాటిన వ్యక్తులు అపుడప్పుడు వీటిని పరీక్షించుకోవాలని అంటున్నారు. అయితే నడక, ప్రాణాయామం వంటివి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి

Related News