logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రపంచానికి శుభవార్త: కరోనా పై ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ టీకా విజయం..!

కరోనాపై పోరాటం చేస్తున్న ప్రపంచానికి ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ వాక్సిన్ కొత్త ఆశలు చిగురింపజేస్తుంది. మనుషులపై జరిగిన ఫెజ్-1 క్లినికల్ ట్రయల్స్ లో ఈ వాక్సిన్ విజయం సాధించింది. ఊహించిన దాని కన్నా రెట్టింపు వేగంతో 90 శాతం మందిలో ఈ వాక్సిన్ మొదటి డోసులోనే ప్రభావవంతమైన ఫలితాలను చూపిందని ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం ‘ది లాన్సెట్’ మెడికల్ జర్నల్ ప్రకటించింది. ఇప్పటికే ఈ వాక్సిన్ ఫెజ్ 1 ట్రయల్స్ సక్సెస్ అయినట్టుగా ఇదివరకే వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. దీంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసే ఆశాకిరణంలా ఈ వాక్సిన్ మారింది.

సీహెచ్ఏడీఓఎక్స్1ఎన్ గా ఈ వాక్సిన్ కు నామకరణం చేశారు. అయితే దీనిని ‘ఏజెడ్1222’ పిలుచుకుంటున్నారు. ఈ వాక్సిన్ ను చింపాంజీలలో కలిగే సాధారణ జలుబు కు కారణమయ్యే వైరస్ నుంచి తీసుకుని జెనెటికల్ గా మార్చారు. ఈ వాక్సిన్ ను వ్యక్తి శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు అది చూడటానికి అచ్చం కరోనా వాక్సిన్ లాగా కనిపిస్తుంది. దీంతో శరీరంలోని యాంటీ బాడీలు అప్రమత్తమవుతాయి. మన రోగ నిరోధక శక్తి దీనిని కరోనా వైరస్ గా భావించి దాడి చేస్తుంది. ఇలా ఈ వాక్సిన్ వాళ్ళ శరీరంలోకి పంపించే వైరస్ ద్వారా రోగ నిరోధక శక్తికి కరోనాపై దాడి చేసి అంతం చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

అలాగే ఈ వాక్సిన్ లో ఉపాయోగించిన వైరస్ చిన్నదే అయినా దీని ద్వారా శరీరంలో ఇతర ఇన్ఫెక్షన్లకు దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ ‘ఏజెడ్1222’ వాక్సిన్ ను మొదటి దశలో 1,077 మందికి ఒకేసారి ఇచ్చి పరీక్షించారు. వారి శరీరంలో ఒక్క డోసుకే ఈ వాక్సిన్ వల్ల గుర్తించదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి అని నిపుణులు తెలిపారు. రక్తంలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు, టీ సెల్స్ విజయవంతంగా ఉత్పత్తి అయినట్లు సైంటిస్టులు గుర్తించారు. టీ సేల్స్ ను అభివృద్ధి చేయడం ద్వారా కొన్నేళ్ల పాటు ఈ వైరస్ నుంచి రక్షణ పొందే విధంగా చేయగలుగుతారు.

ఈ వాక్సిన్ ద్వారా 70 శాతం మందికి తలనోపి, జ్వరం వంటివి వచ్చినా పారసైట్ మాల్ ద్వారా వాటిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాక్సిన్ ను కరోనాపై పోరుకు అందుబాటులోకి తేవాలంటే ఇంకో కీలక దశను దాటవలసి ఉంటుంది. బ్రిటన్ లో ఫేజ్ 2, యూకే, యూఎస్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలో ఫేజ్ 3 ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఈ రెండు దశలలో కూడా ఈ వాక్సిన్ విజయవంతమైతేనే మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వాక్సిన్ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూకే ప్రభుత్వం 10 కోట్ల డోసులను ఆర్డర్ చేసి పెట్టుకుంది. భారత్ లో కూడా ఈ వాక్సిన్ ను పరీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని పూణే లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సిఐఐ) కేంద్ర ప్రభుత్వానికి దరకాస్తు చేసుకుంది. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో కరోనాతో పోరాడుతున్న దేశాలన్నిటికీ కావలసినంత వాక్సిన్ ను తయారు చేయడం సులభమే అంటున్నారు నిపుణులు.

Related News