logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆక్స్‌ఫోర్డ్ వ్యాక్సిన్ త‌యార‌య్యేది ఇక్క‌డే..! ధ‌ర ఎంతో తెలుసా..?

క‌రోనా వైర‌స్ వ్యాప్తితో అల్లాడిపోతున్న ప్ర‌పంచానికి ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలోని జెన్న‌ల్ ఇన్‌స్టిట్యూట్, ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ క‌లిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైన వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌లు ఇప్పుడు ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. మొద‌టి ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఈ వ్యాక్సిన్ క‌రోనాను ఎదుర్కోవ‌డంలో స‌త్ఫ‌లితాలు ఇస్తోంద‌ని, మాన‌వ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌లోపేతం చేస్తుందని తేలింది.

త‌ర్వ‌లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు, మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభం కానున్నాయి. ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ప్ర‌యోగాలు స‌ఫ‌లం కావ‌డంతో 2021కి ముందే క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌నే ఆశ‌లు మొద‌ల‌య్యాయి. అయితే, ఎవ‌రో బ్రిట‌న్ ప‌రిశోధ‌కులు త‌యారుచేసిన వ్యాక్సిన్ మ‌న భార‌త్‌కు ఎప్పుడూ రావాలి అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. వ‌చ్చినా ఈ వ్యాక్సిన్ ధ‌ర పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారు భ‌రించే స్థాయిలో ఉంటుందా అనే అనుమానాలు కూడా మ‌న‌లో చాలామందికి ఉన్నాయి.

ఈ అనుమానాల‌కు పూణేలోని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆద‌ర్ పూణావాలా చాలా వ‌ర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చారు. బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ, స్వీడ‌న్‌కు చెందిన అస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ త‌యార‌య్యేది ఇండియాలోనే కావ‌డం విశేషం. పూణేకు చెందిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ త‌యారు చేసే కంపెనీ. క‌రోనా వ్యాక్సిన్‌ను క‌నుగొనేందుకు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న స‌మ‌యంలోనే ఆక్స్‌ఫోర్డ్‌, సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ మ‌ధ్య ఒక ఒప్పందం జ‌రిగింది.

ఈ ఒప్పందం ప్ర‌కారం ఆక్స్‌ఫోర్డ్ క‌రోనా వ్యాక్సిన్‌ను భార‌త్‌లోనే సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ త‌యారుచేసి ప్ర‌పంచ‌దేశాల‌కు ఎగుమ‌తి చేయాల్సి ఉంటుంది. భార‌త ప్ర‌భుత్వ అనుమ‌తుల త‌ర్వాత ఆగ‌స్టులో భార‌త్‌లోనూ 4000 – 5000 మంది వాలంటీర్ల‌పై ఆక్స్‌ఫోర్డ్ వ్యాక్సిన్‌ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అద‌ర్ పూణావాలా ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

తాము త‌యారు చేయ‌బోయే ఈ వ్యాక్సిన్ ధ‌ర సుమారు రూ.1000 లోపే ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌క్కువ ధ‌ర‌కే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నందున ప్ర‌భుత్వాలు పేద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్‌ను అందించవ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆక్స్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ వ్యాక్సిన్ భార‌త్‌లోనే త‌యారు కానున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ అందే దేశాల్లో భార‌త్‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఉండ‌బోతోంది. పైగా ధ‌ర కూడా త‌క్కువ‌నే ఉండ‌టంతో అంద‌రూ వ్యాక్సిన్ తీసుకునే అవ‌కాశం ఉంది.

Related News