logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?

గతేడాది మార్చిలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ ఆ తర్వాత అన్ని దేశాల్లో తమ ప్రతాపాన్ని చూపింది. భారత్ లో మార్చి నెలలో విధించిన లాక్ డౌన్ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. అయితే భారత్ లో బిలియనీర్ల సంపద మాత్రం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ అనే సంస్థ అసమానత వైరస్ పేరుతో ప్రవేశపెట్టిన నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కరోనా మహమ్మారి భారత దేశంలోని ధనవంతులు, ప్రత్యేక నైపుణ్యం లేని కార్మికుల మధ్య అసమానతలను మరింత దిగజార్చింది అని ఆ నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ సమయంలో భారత్ లో 84 శాతం కుటుంబాలు వివిధ ఆదాయ నష్టాలను చేశాయని ఒక్క ఏప్రిల్ ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అదే సమయంలో 34 శాతం మంది ధనవంతులు మరింత సంపదను ఆర్జించారని పేర్కొంది.

మార్చి 2020 నుంచి మన దేశంలో టాప్ 100 బిలియనీర్ల ఆదాయం పెరిగిందని వీరి ఆదాయం 138 మిలియన్ల పేదలకు పంచితే ఒక్కొక్కరికి రూ. 94,045 చొప్పున వస్తుందని తెలిపింది. దేశంలో అసమానత తీవ్రమైంది. మహమ్మారి సమయంలో ఒక గంటలో రిలయన్స్ అధినేత అంబానీ సంపాదించిన ఆదాయాన్ని ఒక నైపుణ్యంలేని కార్మికుడు సంపాదించడానికి 10 వేల ఏళ్ళు పడుతుంది. సామాన్య ప్రజలు మూడేళ్లలో సంపాదించే ఆదాయాన్ని అంబానీ ఒక సెకనులో పొందారని ఆక్స్ ఫామ్ నివేదిక వ్యాఖ్యానించింది.

Related News