logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

రోజూ పాలు తాగేవాళ్ళు ఈ వీడియో చూస్తే షాకే ..!

ప్రతి రోజూ పాలు తాగే అలవాటున్న వారు మాత్రం ఈ వార్త చదవకపోవడమే మంచింది. పాలలో కల్తీ జరుగుతుందనే వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ నగర శివార్లలోని ఓ డైరీ ఫారంలో పాలు కల్తీ చేయడమే కాకుండా ఓ జుగుప్సాకరమైన పని కూడా చేస్తున్నారు. డబీర్ పురాలో మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి డైరీ ఫార్మ్ నడుపుతున్నాడు.

రోజులాగే పాలు పితకడానికి వెళ్లిన సోహైల్ గేదె పాలు పిండగానే వాటిలోనుంచి ఓ గ్లాసు తీసుకుని తాగేశాడు. తాగితే పరవాలేదు కానీ అతను తాగగా గ్లాసులో మిగిలిన పాలను తిరిగి మళ్ళీ పాలలో కలిపేసాడు. అంతటితో ఆగకుండా తాను తగిన పాల మోతాదు తెలియకుండా పక్కనున్న గేదెలు తాగే నీటి తొట్టి లోనుంచి నీటిని తీసుకొచ్చి ఆ మొత్తం పాలలో కలిపేసాడు.

అక్కడే ఉన్న కొందరు యువతులు ఈ తతంగాన్నంతా వీడియో తీస్తూ అతను చేసిన పనికి షాకయ్యారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో దీనిపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు దీనిపై స్పందించి సోహైల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రోజూ పాలవారి దగ్గర పాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండటం మంచింది.

Related News