logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

సచివాలయంలో మసీదు కూల్చివేతపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేత సమయంలో ప్రార్థనా మందిరాలు దెబ్బతినడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దెబ్బతిన్న ఆలయాలు, మసీదులను కోట్లు ఖర్చు చేసైనా తిరిగి నిర్మిస్తామని కేసీఆర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తాజగా ఈ ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ప్రభుత్వ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. మసీదు, ఆలయ నిర్వాహకులతో కేసీఆర్ స్వయంగా సమావేశం అవుతానని పేర్కొన్నారన్నారు. పాత సచివాలయ భవనం స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలన్నదే ప్రభుత్వం నిర్ణయమని ఈ ఘటన అనుకోకుండా జరిగిందని కాబట్టి రాగ ద్వేషాలకు అతీతంగా దీనిని చూడాలని కేసీఆర్ పేర్కొన్నట్టుగా ఒవైసీ తెలిపారు. కొత్త సచివాలయం తో పాటుగానే కొత్త మసీదు నిర్మాణం కూడా చేపడతానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. దీనిపై యునైటెడ్ ముస్లిం ఫోరమ్ త్వరలో సవివరంగా ప్రకటన చేస్తుందని వెల్లడించారు.

Related News