logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

జాతీయ స్థాయిలో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా.. అరుదైన గుర్తింపు!

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు అరుదైన పురస్కారం లభించింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ జిల్లా అత్యుత్తమ పురస్కారమైన వెబ్ రత్న అవార్డును దక్కించుకుంది. దేశం మొత్తంలో డిజిటల్ గవర్నెన్స్ లో సమర్థవంతంగా నిలిచింది కామారెడ్డి జిల్లా. ఈ నేపథ్యంలో ఈ నెల 30న రాష్ట్రపతి చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ఈ అవార్డును అందుకోనున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శక సేవలను అందించడం కోసం ఒక వెబ్ సైట్ ను రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో జిల్లా గురించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా మ్యాప్, చరిత్ర, పరిపాలన వవిభాగం, జనాభా తదితర అంశాలను వివరణాత్మకంగా రూపొందించి వెబ్ సైట్ లో సమాచారాన్ని ఉంచామన్నారు.

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లతో పాటుగా ఇతర వివరాలను కూడా సైట్ లో పొందుపరిచామని కలెక్టర్ వివరించారు. వెబ్ సైట్ లోని ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రూపొందించామన్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ట్యాబుల ద్వారా ఈ సైట్ న ఉపయోగించేందుకు వీలుగా kamareddy.telangana.gov.in లింక్ ను రూపొందించారు. ఈ సైట్ ద్వారా జిల్లాగురించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని జిల్లా ప్రజలంతా ఈ సైట్ ను ఉపయోంచాలని వారి అభిప్రాయాలూ, సూచనలను తెలపాలని అన్నారు.

 

 

 

 

Related News