logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేమ్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఏ పేజ్‌లో చూసిన మ‌న‌ల్ని న‌వ్వించే మేమ్స్ క‌నిపిస్తూ ఉంటాయి. ప్ర‌త్యేకంగా మేమ్స్ క్రియేట‌ర్లే ఉన్నారు. క‌రెంట్ ఇష్యూస్ పైన, ప్ర‌ముఖుల స్టేట్‌మెంట్స్ పైన ర‌క‌ర‌కాల మేమ్స్ మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. ఈ మేమ్స్ దెబ్బ‌కు కొంద‌రు పాపుల‌ర్ ఫిగ‌ర్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కామెడీ ఫిగ‌ర్లుగా కూడా మారిపోయారు. అయితే, మేమ్స్ త‌యారు చేయ‌డానికి కొంద‌రి ఫోటోలను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.

ఇలా మేమ్స్‌లో ఎక్కువ‌గా ఓ ఆఫ్రికా బుడ్డొడు క‌నిపిస్తుంటాడు. సోష‌ల్ మీడియాను ఫాలో అయ్యే అంద‌రూ క‌చ్చితంగా ఇత‌డిని చూసే ఉంటారు. ప్ర‌పంచంలో ఏ భాష‌లో మేమ్స్ త‌యారు చేసినా ఎక్కువ‌గా ఈ బుడ్డోడి ఫోటోను ఉప‌యోగిస్తుంటారు. ఎవ‌రీ బుడ్డోడు అనేది చాలా మందికి తెలియ‌దు. కానీ, ఇత‌డి వెనుక ఆస‌క్తిక‌ర క‌థ ఉంది. స్పూర్తి నింపే విష‌యాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడు అస‌లు బుడ్డోడే కాదు. చూడ‌టానికి చిన్న వ‌య‌స్సు లాగా క‌నిపిస్తాడు కానీ అత‌డి వ‌య‌స్సు ఏకంగా 38 సంవ‌త్స‌రాలు. జ‌న్యుప‌రంగా లోపం కార‌ణంగా వ‌య‌స్సు పెరిగినా మ‌రుగుజ్జు లాగా మారిపోవాల్సి వ‌చ్చింది. మ‌రో విష‌యం ఏంటంటే అత‌డు సాదాసీదా వ్య‌క్తి కూడా కాదు. ప్ర‌ముఖ నైజీరియ‌న్ యాక్ట‌ర్‌. ఆఫ్రిక‌న్ మూవీస్‌లో ఎక్కువ‌గా న‌టిస్తుంటాడు.

అత‌డి పేరు ఓసిటా ఐహీమ్‌. నైజీరియాలోని బైటోలి అనే ప‌ట్ట‌ణంలో జ‌న్మించాడు. లాగోస్ స్టేట్ యూనివ‌ర్సిటీలో బీఎస్సీ కూడా చ‌దివాడు. 2003లో పాపా ఓ బాలుడి పాత్ర ద్వారా చ‌ల‌న‌చిత్ర రంగంలోని ఓసిటా ఎంట‌ర్ అయ్యాడు. అత‌డి ముఖ క‌వలిక‌లు, హావ‌భావాలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. దీంతో వ‌రుస‌గా సినిమాలు, టీవీ షోల్లో ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. హాస్య‌న‌టుడిగా బాగా పాపుల‌ర్ అయ్యాడు. నాలీవుడ్‌లో ఫేమ‌స్ న‌టుడిగా మారాడు.

క్ర‌మంగా ఇత‌డు ఆఫ్రికా సినిమా దాటి ప్ర‌పంచ‌మంతా ప‌రిచ‌యం అయ్యాడు. సోష‌ల్ మీడియా ద్వారా చాలా ఫేమ‌స్ అయ్యాడు. చిత్ర రంగంలో మంచి పేరు గ‌డించిన త‌ర్వాత ఓసిటా సేవా కార్య‌క్ర‌మాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాడు. ఇన్‌స్పైర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్రికా అనే స్వ‌చ్చంద సంస్థ‌ను ప్రారంభించాడు. ఆఫ్రికా, నైజీరియా యువ‌త‌లో స్ఫూర్తి నింప‌డం ఈ సంస్థ చేసే ప‌ని. అన్న‌ట్లు, ఓసిటా చిత్రరంగంలో బాగా డ‌బ్బు కూడా సంపాదించాడు. భార‌త క‌రెన్సీలో ఓసిటా ఆస్తి సుమారు. రూ.250 కోట్లు.

చ‌ల‌న‌చిత్ర రంగంలో ఓసిటా న‌ట‌న‌కు, నైజీరియాలో ఆయ‌న చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను అక్క‌డి ప్ర‌భుత్వం కూడా బాగానే గుర్తించింది. 2011లో అప్ప‌టి నైజీరియా అధ్య‌క్షుడు ఓసిటాకు మెంబర్ ఆఫ్ ధి ఆర్డ‌ర్ ఆఫ్ ది ఫెడెర‌ల్ రిప‌బ్లిక్‌(ఎంఎఫ్ఆర్) అనే ప్ర‌ముఖ అవార్డును సైతం ఇచ్చి గౌర‌వించారు. ఆ దేశంలో ఇది అత్యున్న‌త పుర‌స్కారం. మ‌రుగుజ్జు అయినా ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌కుండా త‌న న‌ట‌న‌తో ప్ర‌పంచ‌మంతా పాపుల‌ర్ అయిన ఓసిటా ఐహీమ్ అంతే ఆఫ్రిక‌న్ల‌కు చాలా ఇష్టం.

Related News