logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం

న‌టుడు శ్రీహ‌రి మ‌ర‌ణించి ఏడేళ్ల‌వుతున్నా ఆయ‌న‌ను మాత్రం తెలుగు సినీ ప్రేక్ష‌కులు మ‌రిచిపోలేదు. శ్రీహ‌రి న‌టించిన సినిమాలు టీవీల్లో వ‌స్తున్నాయంటే క‌చ్చితంగా ఆ సినిమా మొత్తం చూసే వారు చాలా మంది ఉంటారు. కొన్ని కొత్త సినిమాలు చూసిన‌ప్పుడు ఈ క్యారెక్ట‌ర్ శ్రీహరికి స‌రిగ్గా స‌రిపోతుండే అని ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కోల్పోయిన అద్భుత‌మైన న‌టుల్లో శ్రీహ‌రి ఒక‌రు.

49 ఏళ్ల‌కే మ‌ర‌ణించిన శ్రీహ‌రి తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల్లో హీరోగా, విల‌న్‌గా న‌టించి సినిమా రంగంలో చెర‌గ‌ని ముద్ర వేశారు. అందుకే తెలుగునాట శ్రీహ‌రికి చాలా మంది అభిమానులు ఉన్నాయి. కేవ‌లం శ్రీహ‌రి న‌ట‌న‌కే ఆయ‌న సేవాభావానికి కూడా అభిమానులు ఉన్నారు. గ‌త ఏడేళ్లుగా శ్రీహ‌రిని తెర‌మీద చూసే అవ‌కాశం కోల్పోయిన అభిమానుల‌కు ఇప్పుడు ఆ అవ‌కాశం ల‌భిస్తోంది. పైగా ప‌దిహేడేళ్ల క్రితం యువ‌కుడి ఉన్న శ్రీహ‌రిని తెర‌పై చూడ‌వ‌చ్చు.

కేవ‌లం శ్రీహ‌రినే కాదు మ‌నంద‌రి అభిమాన హీరోయిన్ల‌లో ఒక‌రైన సౌంద‌ర్య‌ను కూడా తెర‌పై చూడ‌వ‌చ్చు. ప‌ద‌హారేళ్ల క్రితం చిన్న వ‌య‌స్సులోనే ఎంతో అమూల్య‌మైన కెరీర్ ఉన్న సౌంద‌ర్య హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆమె న‌ట‌న అద్భుతం. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగునాట మంచి హీరోయిన్ల లిస్టు తీస్తే సౌంద‌ర్య క‌చ్చితంగా ఆ లిస్టులో ఉంటారు. సౌంద‌ర్య న‌ట‌న‌ను చూసే అవ‌కాశం కోల్పోయిన వారికి ఇప్పుడు ఆ అవ‌కాశం ల‌భించింది.

ఎలాగంటే.. నంద‌మూరి బాల‌కృష్ణ డైరెక్ట‌ర్‌గా ప‌దిహేడేళ్ల క్రితం న‌ర్త‌న‌శాల అనే సినిమా ప్రారంభ‌మైంది. కొంత‌కాలం షూటింగ్ కూడా జ‌రిగి అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఈ సినిమాలో అర్జునుడిగా బాల‌కృష్ణ‌, భీముడిగా శ్రీహ‌రి, ద్రౌప‌దిగా సౌంద‌ర్య న‌టించారు. కొన్నాళ్ల‌కే చనిపోతార‌న‌గా సౌంద‌ర్య ఈ సినిమాలో న‌టించారు. అప్పుడు ఆగిపోయిన న‌ర్త‌న‌శాల సినిమా బాల‌కృష్ణ కెరీర్‌లో ఒక వెలితి.

ఇప్పుడు ద‌సరా పండుగ కానుక త‌న అభిమానుల‌కు న‌ర్త‌న‌శాల సినిమాను కానుక‌గా ఇవ్వ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల నిడివి గ‌ల వీడియోను శ్రేయాస్ ఈటీ ప్లాట్‌ఫార్మ్ పై ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా టిక్కెట్ల విక్ర‌యం ప్రారంభ‌మైంది. రూ.50కి ఈ టిక్కెట్ విక్రయిస్తుండ‌గా కొంద‌రు బాల‌య్య అభిమానులు ఏకంగా 10 ల‌క్ష‌ల‌కు ఒక‌టి చొప్పున కొంటున్నారు. అయితే, ఈ సినిమా కేవ‌లం బాలయ్య అభిమానుల‌కే కాదు శ్రీహ‌రి, సౌంద‌ర్య అభిమానుల‌కు కూడా అపురూప కానుక‌.

Related News