logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

చదువు మధ్యలో ఆపేసారా? ఇంటి నుంచే టెన్త్, ఇంటర్ పూర్తిచేయవచ్చు, ఈ ఒక్క ప్రూఫ్ ఉంటె చాలు!

ఆర్థిక, సామాజిక కారణాల వల్ల చదువు పూర్తి చేయలేని వారు తిరిగి చదువుకునే అవకాశం ఉంది. అందుకోసం ప్రతి ఏటా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్లు ఇస్తుంది. పనిచేసుకుంటూ దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివి సర్టిఫికెట్లు అందుకోవాలనుకునే విద్యార్థులకు కూడా ఇది మంచి అవకాశం. స్కూల్ స్థాయిలో చదువు ఆపేసిన వారు ఎవరైనా ఓపెన్ స్కూలింగ్ విధానం ద్వారా పదవ తరగతి, ఇంటర్ విద్యను పూర్తి చేయవచ్చు. పదవ తరగతికి 14 సంవత్సరాలు, ఇంటర్ మీడియేట్ కు 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మీ డేట్ ఆఫ్ బర్త్ సెర్టిఫికెట్ లేదా టీసీ జిరాక్స్ కాపీని ఇచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు.

ఇంటర్ మీడియేట్ కోసం అప్లై చేసుకునేవారు మీ కాస్ట్ సెర్టిఫికెట్, రెసిడెన్షియల్ ప్రూఫ్ ను ఇవ్వాలి. ఈ విధంగా చదువు పూర్తి చేసినవారు సాధారణ విద్యార్థులలాగానే అన్ని వృత్తి విద్యా కోర్సులలో చేరి ఉన్నత విద్యను కూడా పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సులు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం లలో అందుబాటులో ఉంటాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉంటాయి. అక్కడికి వెళ్లి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. లేదా మీ సేవ సెంటర్ల ద్వారా ఆన్ లైన్ విధానంలో అడ్మిషన్ పొందవచ్చు. వీటికి నామమాత్రపు ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.telanganaopenschool.org/ చూడొచ్చు.

మరో విధంగా నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (NIOS) ద్వారా కూడా పదవ తరగతి, ఇంటర్ మీడియేట్ విద్యను పూర్తి చేయవచ్చు. ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ సంస్థల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు కూడా ఎంతో విలువైనవి. అంతర్జాతీయంగా ఈ సెర్టిఫికెట్లకు గుర్తింపు ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఎన్ఐఒఎస్‌లో చేరి చదువు పూర్తిచేసుకోవచ్చు. వీటిల్లో చదువుకునే విద్యార్థులకు ఎన్నో వెసులుబాట్లతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పై చదువుల కోసం వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతర బోర్డుల్లో పాసైన వారు అక్కడి మార్కులను బదిలీ చేసుకుని మిగిలిన సబ్జెక్టుల పరీక్షలు రాసే వీలు ఉంటుంది.

సబ్జెక్టులపై చుక్క గుర్తు పెట్టడం, సప్లిమెంటరీ అని రాయడం లాంటివి ఉండవు. కాబట్టి విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు ఎంచుకుని ఇంటినుంచే చదివి పాస్ అవ్వచ్చు. ఈ సంస్థ సంవత్సరానికి రెండుసార్లు ఏప్రిల్- మే, అక్టోబర్- నవంబర్‌లలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తుంది. తాజాగా ఏప్రిల్ నెలకు సంబందించిన అడ్మిషన్ ప్రక్రియని ఎన్ఐవోఎస్ ప్రారంభించింది. ఈ ఆన్‌లైన్‌‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1, 2021 నుంచి ప్రారంభం అవుతుంది. NIOSలో 10 లేదా 12వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఎస్డీఎంఐఎస్ డాట్ ఎన్ఐవోఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ (https://sdmis.nios.ac.in/ )లో నమోదు చేసుకోవచ్చు.

Related News