logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ఆన్‌లైన్ లోన్ యాప్‌ల దోపిడీ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా ?

లోన్ కావాలా ? ఐదు నిమిషాల్లో 2 వేల నుంచి 5 ల‌క్ష‌ల లోన్ పొందండి… 100 శాతం ఆన్‌లైన్ ప్రాసెసింగ్‌.. క్ష‌ణాల్లో మీ అకౌంట్‌లోకి డ‌బ్బులు.. అంటూ ర‌క‌ర‌కాల మైక్రో ఫైనాన్స్ యాప్‌లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేస్తూ ఈ సంస్థ‌లు ప‌ని చేస్తాయి. త‌క్కువ మొత్తంలో రుణాలు ఇవ్వ‌డం, అడ్డ‌గోలు వ‌డ్డీలు వ‌సూలు చేయ‌డం, డ‌బ్బులు చెల్లించ‌క‌పోతే వేధింపుల‌కు పాల్ప‌డ‌టం ఈ సంస్థ‌ల ప‌ని.

ఆన్‌లైన్‌లో లోన్‌లు ఇచ్చే అనేక యాప్‌‌లు ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర అందుబాటులోకి వ‌చ్చాయి. ర‌క‌ర‌కాల ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ, డ‌బ్బులు అవ‌స‌రం అయిన వారిని ఆక‌ట్టుకుంటాయి ఈ యాప్‌లు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ఈ ప్ర‌క‌ట‌న‌లు చూసి లోన్ తీసుకుందాము అనుకుంటే ముందుగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

యాప్ ఓపెన్ చేయాలంటే మ‌న లోకేష‌న్‌, కెమెరా, కాంటాక్ట్స్ లిస్ట్ యాక్సెస్ అడుగుతుంది. డ‌బ్బులు అవ‌స‌రం ఉంటాయి కాబ‌ట్టి ఎవ‌రూ వెన‌కాముందు ఆలోచించ‌కుండా ఈ యాప్‌ల‌కు యాక్సెస్ ఇచ్చేస్తారు. ఇక అంతే, మ‌న అడ్ర‌స్‌, కాంటాక్ట్స్ లిస్ట్ మొత్తం వాళ్ల స‌ర్వ‌ర్ల‌లో రికార్డ్ అయిపోతుంది. త‌ర్వాత లోన్ పొందేందుకు మ‌న పాన్ కార్డ్‌, ఆధార్ కార్డ్‌, అడ్ర‌స్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మ‌న ఇంట్లో వాళ్ల ఫోన్ నెంబ‌ర్లు కూడా తీసుకుంటారు.

ఈ వివ‌రాల‌న్నీ కూడా వారి వ‌ద్ద రికార్డ్ చేసుకుంటారు. లోన్ ఇచ్చేట‌ప్పుడు వీరి దోపిడీకి అడ్డూఅదుపు ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఎనిమిది వేలు లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫ్రీ, జీఎస్‌టీ, వ‌డ్డీ అంటూ సుమారు 2 వేలు వేస్తారు. నెల రోజుల‌కే ఎనిమిది మొత్తం ప‌ది వేలు చెల్లించాలి. చెల్లించాల్సిన వాయిదాకు రెండుమూడు రోజుల నుంచే ఫోన్లు, మెసేజ్‌లు వ‌స్తుంటాయి.

ఒక‌వేళ క‌నుక వాయిదా రోజు డ‌బ్బులు చెల్లించ‌క‌పోతే ఇక అంతే సంగ‌తులు. రోజురోజుకూ ఫైన్ వేస్తుంటారు. కాల్ సెంట‌ర్ల నుంచి ఫోన్‌లు చేసి వేధించ‌డం ప్రారంభిస్తారు. డ‌బ్బులు క‌ట్టక‌పోతే లీగ‌ల్ నోటీసు పంపిస్తామ‌ని, మిమ్మ‌ల్ని అరెస్టు చేయిస్తామ‌ని హెచ్చ‌రిస్తారు. మ‌నం రిఫ‌రెన్స్‌గా ఇచ్చ‌న ఇంట్లో వాళ్ల నెంబ‌ర్ల‌కు కూడా ఫోన్లు చేసి వేధిస్తారు.

అయినా కూడా డ‌బ్బులు చెల్లించ‌క‌పోతే వీళ్లు వికృతంగా ప్ర‌వ‌ర్తిస్తారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న‌ప్పుడే మ‌న కాంటాక్ట్ లిస్ట్ యాక్సెస్ తీసుకుంటారు కాబ‌ట్టి మ‌న బంధువులు, స్నేహితుల నెంబ‌ర్లు వాళ్ల ద‌గ్గ‌ర ఉంటాయి. ఇత‌డు లోన్ తీసుకొని చెల్లించ‌డం లేదు, మీరైనా చెప్పండి అంటూ ముందు మెసేజ్ చేస్తారు. త‌ర్వాత ఫోటో పెట్టి ఇత‌డు దొంగ అని మెసేజ్‌లు పంపిస్తారు. ఇంకా అనేక ర‌కాలుగా బంధువులు, స్నేహితుల‌కు లోన్ తీసుకున్న వారి గురించి త‌ప్పుగా మెసేజ్‌లు చేస్తుంటారు.

రెండేళ్లుగా ఈ యాప్‌లు విచ్చ‌ల‌విడిగా ఈ దందా చేస్తున్నాయి. చాలామంది వీటి వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డారు. ఇటీవ‌ల ఈ సంస్థ‌ల వేధింపులు భ‌రించ‌లేక ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో తెలంగాణ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. పోలీసుల ప‌రిశీల‌న‌లో ఈ యాప్‌లు చాలావ‌ర‌కు చైనాకు చెందిన‌వ‌ని తేలింది. వీటి అడ్ర‌స్‌లు కూడా స‌రిగ్గా లేవు. ఎక్కువ‌గా ముంబై నుంచి ఈ సంస్థ‌లు న‌డుస్తున్నాయి.

యాప్‌ల వేధింపుల‌పై తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి సీరియ‌స్‌గా స్పందించారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాల చెల్లింపు కోసం ఎవ‌రైనా వేధిస్తే వెంట‌నే ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న కోరారు. చ‌ట్ట‌విరుద్ధంగా ప‌ని చేస్తున్న ఇటువంటి సంస్థ‌లపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అస‌లు ఇటువంటి సంస్థ‌ల‌కు వ్య‌క్తిగ‌త‌, ఆధార్‌, బ్యాంకు వివ‌రాలు ఇవ్వొద్ద‌ని ఆయ‌న కోరారు.

Related News