ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత అప్పుల పాలయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ కోసం చేసిన అప్పు తీర్చలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నగరంలోని ఎల్ బీ నగర్ కు చెందిన జగదీశ్ విపరీతంగా ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాడు. ఈ నేపథ్యంలో గతంలో రూ. 16 లక్షలు అప్పు చేసాడు. ఆ అప్పులన్నిటినీ జగదీశ్ తండ్రి తీర్చి ఇప్పటికైనా బుద్దిగా ఉండాలని మందలించాడు. అయితే ఆ వ్యసనం జగదీశ్ ను వదిలిపెట్టలేదు. మళ్ళి గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఈసారి కూడా లక్షల్లో అప్పులు కావడంతో వాటిని తీర్చలేకపోయాడు. తండ్రిని అడగడానికి మొహం చెల్లక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.