logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

బ్రేకింగ్: కీలక ప్రకటన చేసిన తెలంగాణ సర్కార్.. !

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31వ తేదీ తర్వాత కేంద్రం అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలల్లో రాష్ట్రాలకు విద్యా సంస్థల నిర్వహణ, పాఠశాలల ప్రారంభం పై ఆదేశాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. కాగా ఈలోపే తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంబిస్తున్నట్టుగా తెలిపింది.

1వ తేదీ నుంచే ఆన్ లైన్ తరగతులను నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తించనున్నాయి. టీశాట్, దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధించాలని నిర్ణయించింది. అందుకోసం ఈ నెల 27 నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని తెలిపింది. నిజానికి ఈ నెల 20వ తేదీ నుంచే రాష్ట్రంలో ఆన్ లైన్ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినా కేంద్రం సూచనలతో వెనక్కి తగగింది. ఇప్పుడు మరోసారి ఈ అంశం పై కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను బోధించనున్న విషయం తెలిసిందే.

Related News