logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, మాట్లాడేటప్పుడు ఆయాసం వస్తుందా? ఇలా చేస్తే శ్వాస సమస్యలు మాయం

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం అంటే ఆ వ్యక్తి గుండెకు అవసరమైన ఆక్సిజన్ శాతం అందడం లేదని అర్థం. ఇది వరకే ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది. అయితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులను మన వంట గదిలో దొరికే ఇంగువతో చిటికెలో మాయం చేయవచ్చు.

ఇంగువలో ఉండే యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆస్తమా, బ్రాంకైటిస్, పొడి దగ్గు లాంటి అన్ని శ్వాస సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం. శ్వాసను ఉత్తేజ పరిచి, కఫము తగ్గించడానికి, ఛాతిపైన ఒత్తిడి తగ్గించడానికి ఇంగువ పనిచేస్తుంది.

తేనె, అల్లాన్ని ఇంగువతో కలిపి తీసుకుంటే శ్వాస సమయాలు దూరమవుతాయి. దీర్ఘకాలంగా ఉన్న పొడిదగ్గు, కోరింత దగ్గు, శ్వాసనాలాల వాపు, ఉబ్బసాన్ని కూడా ఇంగువ తగ్గిస్తుంది. ఇంగువను వంటల్లో వాడటం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. దీని వల్ల భవిష్యత్తులో మూర్ఛ, సొమ్మసిల్లడం లాంటి నాడీ సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

ఇంగువను మధుమేహ చికిత్సలో కూడా వాడతారు. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ పొడి వేసి కలిపి తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. ఇంగువ అధిక రక్తపోటును అదుపు చేస్తుంది. ఇంగువను వంటల్లో వాడటం వలన రక్తం చిక్కబడటం, రక్తంలో గడ్డలు ఏర్పడటం లాంటివి తగ్గించి రక్త సరఫరాను సాఫీగా జరిగేలా చేస్తుంది.

Related News