logo

షియోమీ, రియల్‌మికి షాక్.. అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీలు!

భారతీయ మార్కెట్లో చైనా వస్తువులకు ఉన్న డిమాండ్ తెలియంది కాదు. ఇప్పుడు మరో చైనీస్ కంపెనీ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లతో తన హవాను చూపిస్తున్న వన్ ప్లస్ కంపెనీ ఇప్పుడు స్మార్ట్ టీవీల తయారీలో కూడా రాణిస్తుంది. షియోమీ, రియల్ మీ లకు పోటీనిస్తూ మార్కెట్లో అతి తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను విదుదల చేయబోతుంది.

జూన్ 2 న వన్ ప్లస్ నుండి మరో కొత్త స్మార్ట్ టీవీ రాబోతుంది. వన్ ప్లస్ బడ్జెట్ టీవీల ధర విషయానికొస్తే.. వన్ ప్లస్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 15 వేలు. మిడ్ రేంజ్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఉండవచ్చని తెలుస్తుంది. అయితే స్పెసిఫికేషన్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజి పడబోమని సంస్థ పేర్కొంది.

గతేడాది వన్ ప్లస్ నుండి వన్ ప్లస్ టీవీ Q1, వన్ ప్లస్ టీవీ Q1ప్రో మోడల్స్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటి ప్రారంభ ధర రూ. 69 వేలుగా ఉంది. కాగా తమ వినియోగదారులకు అతి తక్కువ ధరలకే ఖరీదైన ఫీచర్లతో స్మార్ట్ టీవీలను అందించాలనే లక్ష్యంతో వన్ ప్లస్ పనిచేస్తుందని సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Related News