logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్

కరోనా బారిన పడిన కుటుంబాలు చితికిపోతున్నాయి. ఓ వైపు మహమ్మారి బారిన పడ్డామనే మనోవేదన మరో వైపు వైద్య సహాయం కోసం పడిగాపులు. ఎలాంటి సేవలు ఎక్కడ దొరుకుతాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి వారంతా సోషల్ మీడియాలో తమ ఆవేదనని పంచుకుంటున్నారు. కొంత మంది ప్లాస్మా కావాలని, మరికొంత మంది తమ వారికి ఆక్సిజన్ దొరకడం లేదని, రెమిడెసీవీర్ కావాలని ఇలా అనేక రకాల ప్రశ్నలు.

కొంత మంది దాతలు ఈ వినతులకు స్పందించి సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాకు సంబందించిన పూర్తి సమాచారాన్ని ఓ యాప్ అందిస్తుంది. ‘హైద్రాబాద్ కోవిడ్ రిసోర్సెస్’ పేరిట ఇద్దరు హైద్రాబాద్ అమ్మాయిలు ఈ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ లో కరోనాకు అవసరమైన చికిత్స, మందులు, ఉచిత బెడ్లు, చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వివరాలు, అంబులెన్సులను సంబందించిన ఫోన్ నంబర్లతో కూడిన డేటాను పొందుపరిచారు. ఇందులో ఉన్న ప్రతి సమాచారం వెరిఫై చేసి నిర్దారించుకున్నదే అని యాప్ రూపకర్తలు మేఘా కాద్రి, వెన్సీ కృష్ణా లు పేర్కొన్నారు. వినియోగదారులు సమాచారం కోసం hydcovidresources.com ను సందర్శించవచ్చు.

యాప్ విడుదలైన రెండు రోజుల్లోనే 50 వేలకు పైగా దీనిని వినియోగించుకున్నారు. రోజుకి 5 వేల మంది చొప్పున యాప్ లో ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కోవిడ్ బారిన పడినవారికి అవసరమైన సమాచారం అందిస్తుండటంతో ఇలాంటి యాప్ మా కోసం కూడా రూపొందించాలని బెంగుళూరు, ముంబై నగరాల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే ఈ యాప్ సేవలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే విధంగా నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related News