logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?

మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా? కరెన్సీ నోట్లపై ఆర్బీఐ త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించనుందా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా నదుతున్న కొన్ని నివేదికల ప్రకారం త్వరలోనే పాత రూ. 100, రూ.10, రూ. 5 కరెన్సీ నోట్లు కనుమరుగవనున్నట్టుగా సమాచారం అందుతుంది. పాత వంద రూపాయల నోట్లను రద్దు చేస్తున్నారని వాటి స్థానంలో కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. వంద రూపాయల నోటుతో పాటుగా పాత పది, ఐదు రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారని అటు సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి.

మార్చి, ఏప్రిల్ నెలల తర్వాత ఈ నోట్లు చెల్లుబాటు కావని ఆర్బీఐ సంకేతాలు ఇస్తుందనేది ఈ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలపై ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగని ఈవార్తలు అసత్య ప్రచారమనే స్పష్టత కూడా ఇవ్వలేదు. దీంతో మరోసారి ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.

2016 ధీమానిటైజేషన్ నిర్ణయం ద్వారా ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి వంద నోట్లను రద్దు చేస్తే సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే వాదన వినిపిస్తుంది. మీడియాలో వెలువడుతున్న వార్తల ప్రకారం .. డిస్ట్రిక్ లెవల్ సెక్యూరిటీ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ), డిస్ట్రిక్ లెవల్ కరెన్సీ మానేజిమెంట్ కమిటీ(డీఎల్ఎంసీ) నిర్వహించిన సమావేశంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ బి మహేష్ మర్చి, ఏప్రిల్ నాటికి పాత 100, 10, 5 కేరెన్సీ నోట్లను చలామణీ లోనుంచి తపించాని యోచిస్తున్నటుగా మీడియా కథనాలు వస్తున్నాయి.

దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు ఈ నోట్లను తీసుకోవడం లేదు. గతంలో పది రూపయల కాయిన్ పై కూడా ఇలాంటి వార్తలే రావడంతో వాటిని తీసుకోవడానికి కూడా ప్రజలు నిరాకరిస్తూ వస్తున్నారు, పది రూపాయల కాయిన్ వాడుకలోనే ఉందని ఈ కాయిన్ ను తీసుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా బ్యాంకుల వద్ద కుప్పలు తెప్పలుగా పది రూపాయల కాయిన్లు వచ్చిపడ్డాయి. తాజాగా దీనిపై కూడా ఆర్బీఐ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పది రూపయల కాయిన్ చెలామణిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొంది ఆర్బీఐ.

ఇక వంద నోట్ల రద్దు విషయానికొస్తే నకిలీ నోట్ల బెడద వల్లనే ఆర్బీఐ పాత వంద రూపాయల నోట్లను రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒక వేళ రద్దు చేసిన కూడా ఒకేసారి ఈ నోట్ల రద్దు ఉండదని వీటిని క్రమంగా మార్కెట్ నుంచి తొలగిస్తారని అంటున్నారు. అంటే బ్యాంకుల్లోకి పాత నోట్లు మళ్ళీ కస్టమర్లకు వెళ్లవు. బ్యాంక్ నుంచి వాటిని తిరిగి ఆర్బీఐ కి మళ్లిస్తారు. ఆ తర్వాత కొత్త నోట్ల ను విడుదల చేస్తారు.

Related News