logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు

దేశీయ ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్న ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌చ్చేస్తోంది. ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఓలా సంస్థ త‌మ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌బోతోంది. ఇప్ప‌టికే ప్రీబుకింగ్ కూడా ఓలా ప్రారంభించింది. ప్రారంభించిన కేవ‌లం 24 గంట‌ల్లో ల‌క్ష మంది ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను బుక్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి ఓలా స్కూట‌ర్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఫీచ‌ర్లు, ధ‌ర‌కు సంబంధించి ఆస‌క్తికర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ముందుగా ఈ స్కూట‌ర్ ఫీచ‌ర్ల‌ను ప‌రిశీలిస్తే.. అన్ని టూవిల‌ర్లు కేవ‌లం ముందుకు మాత్ర‌మే వెళ్ల‌గ‌ల‌వు. కానీ, ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు రివ‌ర్స్ మోడ్ ఆప్ష‌న్ కూడా ఉండ‌టం చాలా స్పెష‌ల్‌గా చెబుతున్నారు. ఓలా స్కూట‌ర్‌లో లేటెస్ట్ టెక్నాల‌జీని చాలా వినియోగించారు.

స్మార్ట్‌ఫోన్‌లోని ఒక అప్లికేష‌న్ ద్వారా స్కూట‌ర్‌ను లాక్ చేసే, అన్‌లాక్ చేసే ఫీచ‌ర్‌ను ఓలా స్కూట‌ర్‌లో పెట్టారు. ఈ రెండు విష‌యాల‌ను స్వ‌యంగా ఓలా సీఈఓ భ‌వీష్ అగర్వాల్ ప్ర‌క‌టించారు. ఇక‌, ఈ స్కూట‌ర్‌కు ఒక‌సారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అయితే, ఎంత సేప‌ట్లో ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంద‌నేది ఇంకా కంపెనీ ప్ర‌క‌టించ‌లేదు.

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ పొడ‌వు 1,860 మిల్లీమీట‌ర్లు, వెడ‌ల్పు 700 మిల్లీ మీట‌ర్లు ఉంటుంది. ఎత్తు 1,155 మిల్లీ మీట‌ర్లు ఉండ‌గా వీల్‌బేస్ 1,345 మిల్లీమీట‌ర్లు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ స్కూట‌ర్ బ‌రువు 74 కిలోలు ఉంటుంది. కేవ‌లం 4.5 సెక‌న్ల‌లో 45 కిలోమీట‌ర్ల స్పీడ్ పీక‌ప్ అందుకునేలా స్కూట‌ర్‌ను త‌యారుచేశారు. గంట‌కు 100 కిలోమీట‌ర్ల టాప్ స్పీడ్‌తో ఈ స్కూట‌ర్‌పై దూసుకెళ్ల‌వచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన చాలా ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌లో స్పీడ్ త‌క్కువ‌గా ఉంది. ఓలాలో ఈ స‌మ‌స్య లేదు.

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌పై అఫీషియ‌ల్‌గా ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు. కాక‌పోతే ఎక్స్‌షోరూం ధ‌ర 1 ల‌క్షా 20 వేల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 10 ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అందుబాటులోకి రానుంది. బుక్ చేసుకున్న వారికి ఓలా స్కూట‌ర్‌ను హోం డెలివ‌రీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విధానం దేశంలో మొద‌టిసారి.

Related News