logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మాట నిల‌బెట్టుకున్న కేసీఆర్‌… క‌ల్న‌ల్ భార్య‌కు ఉన్న‌తోద్యోగం

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులో చైనా సైనికుల‌తో గొడ‌వ‌లో మ‌ర‌ణించిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ ప్ర‌భుత్వం డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ త‌న నివాసంలో అందించారు. ఆమెకు హైద‌రాబాద్‌, ప‌ర‌స‌ర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సంతోషికి మంచి శిక్ష‌ణ ఇప్పించాల‌ని, ఉద్యోగంలో కుదురుకునే వర‌కు తోడుగా ఉండాల‌ని త‌న కార్య‌ద‌ర్శి స్మిత స‌బ‌ర్వాల్‌కు ముఖ్య‌మంత్రి సూచించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వానం మేర‌కు ఇవాళ సంతోష్ బాబు కుటుంబం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చింది. వారితో క‌లిసి ముఖ్య‌మంత్రి మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్ర‌భుత్వం ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. కాగా చైనాతో ఘ‌ర్ష‌ణ‌లో మ‌ర‌ణించిన సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ప‌రిహారం, హైద‌రాబాద్‌లో ఇంటి స్థ‌లం, ఆయ‌న భార్య సంతోషికి ఉద్యోగం ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ హామీల‌ను కేసీఆర్ నెర‌వేర్చారు.

Related News