ఏపీ- ఒడిశా రాష్ట్రాలకు మధ్య రెండు దశాబ్దాలుగా ఓ వివాదం ఉంది. తాజాగా పంచాయతీ ఎన్నికల నేసథ్యంలో మరోసారి ఈ వివాదం రాజుకుంటుంది. ఒడిశా రాష్ట్రం ఏపీ ప్రభుత్వం పై ఏకంగా సుప్రీం ను ఆశ్రయించింది. అందుకు కారణం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదమే. ఏపీకి ఒడిశా రాష్ట్రానికి మధ్య కోటియా అనే ప్రాతం ఉంది.
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పట్టు చెన్నూరు, పగులుచెన్నూరు. కూరాకుటి, గంజాయిబద్ర, సారిక పంచాయతీలో 23 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వీటిని కోటియా పల్లెలుగా పిలుస్తారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు నోటోఫికేషన్ విడుదలైంది. కానీ అందుకు ఒడిశా రాష్ట్ర సర్కార్ మాత్రం ఒప్పుకోవడం లేదు. తమ ప్రాంతమైన కోటియాలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నిస్తుంది. కోటియా ప్రాంతంపై సుప్రీ కోర్టును ఆశ్రయించింది.
తమ భూభాగంలో ఉన్న మూడు పంచాయతీల పేర్లను మార్చి ఏపీ ప్రభుతం ఎన్నికలు నిర్వహిస్తుందని ఒడిశా వాదిస్తుంది. వాటికి సంబందించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. దీనిపై ఏపీ సీఎస్, ఎన్నికల సంఘం నుంచి సంజాయిషీ కోరుతున్నామని ప్రకటించింది. అయితే ఒడిశా సర్కార్ తీరును ఏపీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కోటియా పల్లెల్లో ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయని ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందని అంటున్నారు.
ఈ ప్రాంతంలోని నేలల్లో లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉందని దానిపై కన్నేసిన ఒడిశా సర్కార్ వాటిని దక్కించేందుకు ఇలా ఆరోపిస్తుందంటున్నారు. అయితే ఒడిశా ప్రభుత్వం మాత్రం పోలీసులను రంగంలోకి దింపింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని అక్కడి ప్రజలకు సూచిస్తుంది. ప్రజలు మాత్రం రెండుగా చీలి ఓటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిపై సుప్రీం ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి.