logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పథకం ప్రకారమే హత్య.. వరలక్ష్మి కేసులో కొత్త కోణం

ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. గాజువాకలో వరలక్ష్మి హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తమ కూతురు ఉన్నత చదువులు చదువుతుందని ఆశపడిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సుందరయ్య కాలనికి చెందిన వరలక్ష్మిని చిట్టిబాబు కాలనికి చెందిన అఖిల్ సాయి అనే యువకుడు ప్రేమ పేరిట వెంట పడేవాడు.

ఇటీవల తనను పట్టించుకోకుండా రాము అనే మరో యువకుడితో చనువుగా ఉంటుందని అఖిల్ వరలక్ష్మిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారమే వరలక్ష్మిని హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. నిన్న రాత్రి సమయంలో నీతో మాట్లాడాలని వరలక్ష్మికి ఫోన్ చేసి సాయిబాబా గుడి దగ్గరకు రావాలని పిలిపించాడు.

అదే సమయంలో రాముని కూడా పిలిపించాడు. అక్కడకు వెళ్లిన వరలక్ష్మి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తన అన్నయ్యకు ఫోన్ చేసి రావాలని కోరింది. వరలక్ష్మి తండ్రి, సోదరుడు అక్కడకు చేరుకునే సమయానికే అఖిల్ బ్లేడుతో ఆమె గొంతుకోసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసాడు.

గుడి మెట్లపై కొన ప్రాణాలతో ఉన్న వరలక్ష్మిని ఆసుపత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Related News