logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం

టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల అనేక లాభాల‌తో పాటు కొన్ని న‌ష్టాలు కూడా వ‌చ్చాయి. టెక్నాల‌జీని ఉప‌యోగించుకొని మోసాలు చేయ‌డం పెరిగిపోయింది. దీనినే పోలీసులు సైబ‌ర్ క్రైమ్ అంటారు. సైబ‌ర్ క్రైమ్‌ను అదుపు చేయ‌డానికి పోలీసులు ప్ర‌త్యేక విభాగాల‌ను కూడా ఏర్పాటు చేసి ప‌ని చేస్తున్నారు. అయితే సైబ‌ర్ కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త అడ్డ‌దారులు తొక్కుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసి ల‌క్ష‌లు దండుకుంటున్నారు.

ఇటువంటి నూత‌న త‌ర‌హా సైబ‌ర్ క్రైమ్ ఈ మ‌ధ్య జ‌రుగుతోంది. సైబ‌ర్ క్రైమ్ గ్యాంగ్‌లో ఉండే మ‌హిళ‌లు వ‌ల‌పు వ‌ల వేస్తూ యువ‌కులు, పెద్ద‌వాళ్ల‌ను ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. వీరి వ‌ల‌లో చిక్కిన వారు బ‌య‌ట‌కు చెప్పుకోలేక న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. వాళ్లు అడిగినంత ముట్ట‌జెపుతున్నారు. దీంతో పోలీసులు ఈ త‌ర‌హా మోసాల‌పైన జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు.

ముందుగా యువ‌కులు, పురుషుల వాట్సాప్‌కు ఓ యువ‌తి వీడియో కాల్ చేస్తుంది. మెళ్లిగా ప‌రిచయం చేసుకొని క‌వ్వించేలా మాట్లాడుతుంది. ఇలాగే కొన్నిసార్లు మాట్లాడిన త‌ర్వాత మెళ్లిగా శృంగార‌ప‌ర‌మైన సంభాష‌ణ‌లు ప్రారంభిస్తుంది. అవ‌త‌లి వాళ్లు ఆ యువ‌తికి ఆక‌ర్షితులై ముందుకెళితే న్యూడ్ వీడియో కాల్ చేస్తుంది ఆ యువ‌తి.

తానే ముందుగా బ‌ట్ట‌లు తీసేస్తుంది. త‌ర్వాత అవ‌త‌లి వ్య‌క్తిని కూడా బ‌ట్ట‌లు తీసేయాల‌ని రెచ్చ‌గొడుతుంది. ఒక‌వేళ క‌నుక ఆ యువ‌తి మాయ‌మాట‌ల‌కు రెచ్చిపోయి బ‌ట్ట‌లు తీసేసి వీడియో కాల్ మాట్లాడితే ఇక నిండా మునిగిన‌ట్లే. యువ‌తి తెలివిగా అవ‌త‌లి వ్య‌క్తి బట్ట‌లు లేకుండా ఉన్న వీడియోను రికార్డు చేస్తుంది. కాల్ క‌ట్ చేసిన త‌ర్వాత ఆ వీడియోను పంపిస్తుంది. దీంతో షాక్ అవ్వాల్సి వ‌స్తుంది.

అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో పెడ‌తామ‌ని భ‌య‌పెడ‌తారు. దీంతో ఎక్క‌డ ప‌రువు పోతుందో అనే భ‌యంతో ఈ ట్రాప్‌లో చిక్కిన వారు డ‌బ్బులు ఇచ్చుకుంటున్నారు. డ‌బ్బులు లేని వాళ్లు అప్పులు చేసి ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఇటీవ‌లి కాలంలో ఇటువంటి నేరాల‌ను పోలీసులు గుర్తించారు. ఇలా వ‌చ్చే కాల్స్ మాట్లాడి మోస‌పోవ‌ద్ద‌ని పోలీసులు సూచిస్తున్నారు.

Related News