యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు వరుస పెట్టి శుభవార్తలు వినిపిస్తున్నాడు. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ ల సినిమా ఆగిపోయిందనే వార్తలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో వెంటనే మరో అప్ డేట్ తో రెడీ అయ్యాడు తారక్. త్రివిక్రమ్ కథ నచ్చకపోవడం తో ఆ సినిమాను పక్కన పెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ ఇగ్నల్ ఇచ్చాడు.
పాత కథలనే కొత్తగా కమర్షియలైజ్ చేసి హిట్టుకొటడంలో అనిల్ రావిపూడి తర్వాతే ఎవరైనా. రాజమౌళి, కొరటాల తర్వాత ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత ఈ దర్శకుడి రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తోనే సినిమాకు సిద్దమవుతున్నాడు.
ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా తో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా అయిపోగానే జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా జానర్ ఏమిటనే విషయంపై క్లారిటీ రావలసి ఉంది. ఈ వార్త ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. మరోవైపు త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడంతో కొరటాలతో కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాడు ఎన్టీఆర్. అందుకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.