logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ఆ యంగ్ హీరో సినిమాకు తారక్ అభిమానుల అండ!

‘హిట్’ సినిమాతో హిట్ కొట్టిన మాస్ కా దాస్ ఈసారి లవర్ బాయ్ గా అలరించనున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తున్న ‘పాగల్’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ ఇపుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఒక్క రోజులోనే 3.3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రేండింగ్ లో చేరిపోయింది. అయితే ఈ సినిమా విజయాన్ని ఓ స్టార్ హీరో అభిమానులు భుజాలకెత్తుకున్నారని టాక్ నడుస్తుంది.

ఆ స్టార్ హీరో ఎవరో కాదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. విశ్వక్ సేన్ పాగల్ టీజర్ ఇంత వైరల్ గా మారడానికి కారణం ఎన్టీఆర్ అభిమానులేనట. ఇంతకీ ఈ హీరోకి వారికి ఉన్న సంబంధం ఏమిటంటే. విశ్వక్ సేన్ కూడా ఎన్టీఆర్ కు వీరాభిమాని కావడంతో ఈ హీరోకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారు.

ఆ మధ్య తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ర్యాప్ సాంగ్ ను విడుదల చేసి తన హీరోపై అభిమానాన్ని చాటుకున్నాడు విశ్వక్ సేన్. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఫుల్ సపోర్ట్ కూడగట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాగల్ టీజర్ లో కూడా విశ్వక్ సేన్ లుక్ ఎన్టీఆర్ ఊసరవెల్లి లుక్ తో మ్యాచ్ కావడం అనుకోకుండా కలిసొచ్చిన అంశం. ఇప్పుడు వారంతా ఎన్టీఆర్ ను ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పాగల్ సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్దమవుతుంది.

Related News