logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఊహించని షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. పడిపోనున్న బీజేపీ ప్రభుత్వం!

మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న అత్యంత కీలకమైన ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించింది. ప్రభుత్వంలోని నలుగురు మంత్రులలో తమ పదవులకు రాజీనామా చేయించింది.

వీరిలో డిప్యూటీ సీఎం జోయ్ సింగ్ కుమార్ కూడా ఉండటం గమనార్హం. అదే సమయంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు సభ్యులు కూడా రాజీనామా చేసారు. తాజా రాజీనామాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 19 కి పడిపోయింది. అయితే తిరుగు బాటు చేసిన ఎమ్మెల్యేలంతా ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ కు అధిక బలం చేకూరింది. దీంతో బీజేపీ పార్టీ పతనం దిశగా అడుగులు వేస్తుంది.

మరోవైపు విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనీ తక్షణమే అసెంబ్లీలో బల నిరూపణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ నేడు గవర్నర్ తో సమావేశం కాబోతున్నారని సమాచారం. కాగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 60 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. అయితే కేవలం 21 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఇతరులను తమవైపుకు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Related News