logo

  BREAKING NEWS

ఇంటర్ విద్యలో కీలక మార్పులకు ఏపీ సర్కార్ ఆదేశాలు!  |   కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |  

ప్రపంచ నంబర్​వన్‌ క్రీడాకారుడు జకోవిచ్ కు కరోనా!

ఇప్పటికే లక్షలాది మందిని వణికిస్తున్న కరోనా మహమ్మారి క్రీడాకారులపై కూడా పగ బట్టింది. తాజాగా పది మంది పాకిస్థానీ క్రికెటర్లు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆయన భార్య జెలీనాకు కూడా కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. కాగా తమ ఇద్దరు పిల్లలకు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చిందని జకోవిచ్ సంతోషం వ్యక్తం చేసాడు.

తాము కచ్చితంగా 14 రోజుల క్వారెంటైన్ ను పాటిస్తామని, తమ ద్వారా కరోనా ఇతరులకు సోకి ఉంటె తనను క్షమించాలని జకోవిచ్ ఆవేదన వ్యక్తం చేసాడు. జకోవిచ్ నేతృత్వంలో సెర్బియా, క్రొయేషియాల్లో నిర్వహించిన ఆడ్రియా టూర్​ టోర్నీలో పాల్గొన్న ముగ్గురు ప్లేయర్లకు కూడా కరోనా సోకింది. టోర్నీ ముగించుకుని వచ్చిన వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా తమ దంపతులిద్దరికీ పాజిటివ్ గా తేలిందని జకోవిచ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించాడు.

కాగా ఈ టోర్నీ ఆడుతున్న సమయంలోనే జకోవిచ్ పై కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా తాను స్వచ్ఛమైన మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నానని, తమ ప్రాంతంలో ఐక్యతను చాటేందుకు.. సంఘీభావాన్ని తెలిపేందుకు టోర్నీ ప్రారంభించానని జకోవిచ్ తెలిపాడు.

Related News