logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

శంక‌ర్ కూడా కాపీరాయుడేనా ? రోబో క‌థ కాపీ కొట్టాడా ?

ద‌ర్శ‌క‌రంగంలో త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఒక సంచ‌ల‌నం. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డం, గొప్ప‌గా సినిమాను తెర‌కెక్కించ‌డంలో తను ముందుంటాడు. మిగ‌తా ద‌ర్శ‌కులు అంతా ఒక రూట్‌లో వెళ్లి మూస సినిమాలు తీస్తున్న స‌మ‌యంలో శంక‌ర్ భిన్న‌మైన క‌థ‌ల‌ను సినిమాలు తీసి అనేక హిట్‌లు అందుకున్నాడు. అందుకే కేవ‌లం త‌మిళంలోనే కాదు శంక‌ర్ సినిమా అంటే దేశ‌వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తుంటారు.

ఈ సినిమా క‌థ నాదే, ఆ సినిమా క‌థ నాదే అంటూ చిన్న ర‌చ‌యిత‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం, కోర్టుల‌కు వెళ్ల‌డం సాధార‌ణంగా జ‌రిగేదే. సాధార‌ణ క‌థ‌ల్లో పోలిక‌లు ఎక్కువ ఉండ‌టం స‌హ‌జ‌మే కాబ‌ట్టి ఇటువంటి ఆరోప‌ణ‌లు వ‌స్తుంటాయి. వీటిలో చాలా వ‌ర‌కు నిల‌బ‌డ‌వు. అయితే, శంక‌ర్ వంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిపై కాపీ ఆరోప‌ణ‌లు రావ‌డం మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. అది కూడా సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా వ‌చ్చి భారీ హిట్ సాధించి రోబో సినిమాపై ఈ ఆరోప‌ణ‌లు రావ‌డం, ఓ ర‌చ‌యిత శంక‌ర్‌పై పోరాటం చేస్తుండ‌టం చూస్తుంటే శంక‌ర్ వంటి వారు కూడా క‌థ‌లు కాపీ కొడ‌తారా అనే అనుమానాలు వ‌స్తాయి.

కొంచెం వివ‌రాల్లోకి వెళ్తే… 2010లో రోబో సినిమా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, హీరో ర‌జ‌నీకాంత్‌, హీరోయిన్ ఐశ్వ‌ర్య రాయ్‌. టాప్ హీరో, టాప్ హీరోయిన్‌, టాప్ ద‌ర్శ‌కుడు క‌లిసి తీసిన సినిమా ఇది. ఇంకేముందు భారీ హిట్ అయ్యింది. ఎప్పుడూ చూసిన క‌థ కాక‌పోవ‌డం, సైంటిఫిక్ స్టోరీ కావ‌డం వ‌ల్ల సినిమాకు మంచి పేరొచ్చింది. హీరో ఒక రోబోను త‌యారుచేయ‌డం, అది విల‌న్‌గా మారడం, హీరోయిన్‌ను ప్రేమించ‌డం, చివ‌ర‌కు డిస్‌మాంటిల్ కావ‌డం ఈ సినిమా స్టోరీ.

ఈ సినిమా చూసిన త‌ర్వాత ఆరూర్ త‌మిళ‌నాద‌న్ అనే ర‌చ‌యిత ఈ క‌థ త‌న‌దే అని ఆరోప‌ణ‌లు చేశారు. ఇందుకు ఆధారాలు చూపించాడు. తాను 199‌6లోనే ఇనియా ఉద‌యం అనే మ్యాగ‌జైన్‌లో ఈ క‌థ రాశాన‌ని, 2007లో ధిక్ ధిక్ దీపికా దీపికా అనే పుస్త‌కంలోనూ ఈ క‌థ‌ను ప్ర‌చురించాన‌ని చెప్పాడు. త‌న క‌థ‌ను శంక‌ర్ కాపీ చేశాడ‌ని, రోబో సినిమా క‌థ నాదేన‌ని ఆరోపించాడు. కానీ, పాపం ఎవ‌రూ ఆయ‌న మాట న‌మ్మ‌లేదు. పోలీసుల‌ను ఆశ్రయించినా ప‌ట్టించుకోలేదు.

కానీ, ఆ ర‌చయిత ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి లాగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయ‌న మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తే శంక‌ర్ హైకోర్టుకు వెళ్లాడు. రెండేళ్ల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ర‌చయిత ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని చెప్పింది. కానీ, రెండు క‌థ‌ల మ‌ధ్య 16 పోలిక‌లు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి, విచార‌ణ కొన‌సాఇంచాల‌ని మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. మ‌ళ్లీ క‌థ మెజిస్ట్రేట్ కోర్టుకు వ‌చ్చింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది.

Related News