ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త టీవీ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. గతేడాది 55 అంగుళాల టీవీని లాంచ్ చేసిన నోకియా తాజాగా 43 అంగుళాల స్మాట్ టీవీని లాంచ్ చేసింది. దీని ధరను రూ. 31,999 గా నిర్ణయించింది. జూన్ 8వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్టులో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. కేవలం నలుపు రంగులో మాత్రమే ఈ టీవీ లభ్యం కానుంది.
ఫీచర్స్:
43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ ఎల్ ఈడీ ఫ్లాట్ స్క్రీన్ డిస్ ప్లే
16 జీబీ ఇంటర్ నెట్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆపరేటింగ్ సిస్టం
వైఫై, బ్లూటూత్ 5.0 సపోర్ట్
వీటితో పాటుగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ ను ఇందులో ఇన్ బిల్ట్ గా అందిస్తారు. గూగుల్ ప్లే స్టోర్, కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీవీని కొనుగోలు చేసిన వారికీ అదనంగా 6 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్సక్క్రిప్షన్ కూడా లభించనుంది.
ఆఫర్లు:
ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్న వారికీ 10 శాతం తగ్గింపు. సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది.