logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనాకు వాక్సిన్ అవసరం లేదు.. ఇదొక్కటి చాలు

ప్రపంచవ్యాప్తంగా భీబత్సం సృష్టిస్తున్న కరోనాకు మందు లేదని, ఈ వైరస్ సోకితే ప్రాణ గండం తప్పదని భయాందోళనకు లోనవుతున్నవారికి శుభవార్త. కరోనా వైరస్ సోకిన వారికి ఎలాంటి వాక్సిన్ అవసరం లేదంటున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్ సునేత్రా గుప్తా. కరోనా వాక్సిన్ అవసరం లేకుండానే సహజంగా ఈ వైరస్ నయమవుతున్నట్టుగా ఆమె పేర్కొన్నారు.

వృద్దులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అధికంగా కరోనా బారిన పడుతున్న మాట వాస్తవమే. కానీ మిగిలినవారు తొందరగానే మామూలు స్థితికి చేరుకుంటున్నారన్న విషయాన్నీ ఆమె గుర్తు చేసారు. కరోనాను సాధారణ ఫ్లూ మాదిరిగానే చూడాలని అనవసరంగా ఆందోళన చెందాల్సిన వసరం లేదంటున్నారు. స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా లాగానే కొన్నాళ్ళకి ఇది కూడా మన జీవితంలో భాగమవుతుందన్నారు.

1918 లో వచ్చిన ఇన్ ఫ్లూయెంజా భారీన పడి 50 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. దానితో పోలిస్తే కరోనా అంత ప్రమాదమైన వైరస్ ఏమీ కాదు. కానీ కరోనా భారిన పడకుండా ఉండడానికి మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని కాపాడతాయన్నారు. మొదట్లో లాక్ డౌన్ కరోనా కేసుల్ని నియంత్రించినా రానురాను ఇది కూడా కరోనాను ఆపలేదన్నారు. స్వీయ నియంత్రణే దీనికి అసలైన మందన్నారు. లాక్ డౌన్ ను ఎక్కువకాలం పొడిగిస్తే ఆర్థిక ఇబందులు తప్పవన్నారు. కరోనా వాక్సిన్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఏడాది చివరికల్లా కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

Related News