logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

హైదరాబాద్ ప్రజలకు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరిక..!

హైదరాబాద్ ప్రజలకు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కీలక హెచ్చరికలు జరీ చేసారు. ఈ మేరకు తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు బ్రేక్ పడనుంది. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు నగరం సర్వాంగ సుదరంగా ముస్తాబవుతోంది. ప్రతి వీధి గణేష్ మండపాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. కానీ కరోనా కారణంగా 2020 సంవత్సరం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏదీ గతం లా లేదు. పెళ్లిళ్లు,శుభకార్యాలతో పాటుగా పండుగలపై కూడా అనేక ఆంక్షలు ఉంటున్న విషయం తెలిసిందే.

మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం మొహరం, వినాయకచవితి ఉత్సవాలను ప్రజలు ఇంట్లోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా తమకు సహకరించని వారిపై చర్యలకు వెనుకాడబోమని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం, సంరక్షణే తమకు అన్నిటికన్నా ముఖ్యమైందని తెలిపారు. విగ్రహాల ఏర్పాటు చేయవద్దని తెలిపిన ప్రభుత్వం ఆదేశాలను ప్రజలందరూ బాధ్యతగా పాటించాలన్నారు. ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ జీవితాలు మీ కుటుంబ సభ్యులకే కాదు దేశానికి కూడా ఎంతో ముఖ్యమని మీరు తీసుకునే చిన్న జాగ్రత్తల వల్లే సురక్షితంగా ఉండగలరని అంజనీకుమార్ పేర్కొన్నారు.

Related News