కరోనా కేసుల నేపథ్యంలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. గంట తర్వాత అనూహ్యంగా అధికారులు మరో ప్రకటన చేసారు. తిరుమలలో కంటైన్మెంట్ జోన్ లేదని తమ అధికారులు పొరపాటున మరో లిస్టును చదవడం వల్ల సందిగ్దత నెలకొందని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. కాగా తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతానికైతే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ రోజుకి 10 వేల భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అధికారుల తాజా ప్రకటనలో ఆలయం తెరిచే ఉంటుందని భక్తులు నిస్సందేహంగా దర్శనం చేసుకోవచ్చునని వెల్లడించారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని టీటీడీ ప్రకటించింది.