logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

మందుబాబులకు షాకిస్తున్న కోవిడ్ టీకా..!

కరోనాను అంతం చేయడంకోసం పలు దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కొన్ని వాక్సిన్ లు రెండు, మూడు దశల ట్రయల్స్ ను పూర్తి చేసుకున్నాయి. రష్యా కూడా తమ దేశ పౌరుల కోసం కరోనా వాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. అయితే కరోనా వాక్సిన్ వేసుకోవాలంటే ఆ దేశంతో పాటుగా ఇతర దేశాల్లో మందుబాబులు హడలిపోతున్నారు.

కారణం ఒకసారి వాక్సిన్ వేసుకుంటే 40 రోజులకు పైగా వాక్సిన్ తాలూకా ఇతర ప్రభావాలు లేకుండా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఎక్కువగా జన సమూహాల్లోకి వెళ్ళకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అయితే వీటితో పాటుగా ఇప్పుడు మరో వార్త మందుబాబులకు నిద్ర లేకుండా చేస్తుంది. అదేంటంటే కరోనా టీకా వేసుకునే వారు రెండు నెలల పాటు మద్యానికి దూరంగా ఉండాలి అని ఆయా దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తున్నాయి.

కరోనా వాక్సిన్ ఇచ్చిన తర్వాత అది పూర్తిగా శరీరంపై పని చేయడానికి రెండు నెలల సమయం పడుతుంది. అప్పటివరకు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి లిక్కర్ ప్రియులు రెండు నెలల పాటు మద్యం జోలికి వెళ్ళకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త నిజంగానే మందుబాబులకు షాకిస్తుంది.

Related News