logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో కోళ్లు మృతి!

కరోనాతో పాటుగా ఇప్పుడు బర్డ్ ఫ్లూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే హార్ట్ లోని ఏడూ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. వందల సంఖ్యలో పక్షులు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కేబర్డ్ ఫ్లూ కేసులు బయటపడలేదు. మంత్రి ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ తాజాగా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో కోళ్లు కుప్పకూలుతున్నాయి.

వర్ని మండలం జలాల్ పూర్ లో మేతకు వెళ్లిన కోళ్లు ఎక్కడికక్కడే పడిపోతున్నాయి. అలా పడిపోయిన కొద్ది సేపటికే మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజల్లోబర్డ్ ఫ్లూ భయం నెలకొంది. ఆ వైరస్ కారణంగానే కోళ్లు మరణించాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై స్పందించిన పశు వర్తక శాఖ అధికారులు మాత్రం ఇది బర్డ్ ఫ్లూ కాదని రానికేట్ అనే వ్యాధి వల్లనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని ప్రాథమిక విచారణలో నిర్దారించారు.

కోళ్ల రక్త నమూనాలను సేకరించి వాటి మృతికి గల కారణాలను వెతికే పనిలో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇప్పుడు కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ పై అవగాహన పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Related News