logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆ హీరో నన్ను పెళ్లి చేసుకోవాలని కోరేవాడు: నిత్యామీనన్

సినిమా పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య రూమర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వరుసగా ఓ రెండు, మూడు సినిమాలు చేస్తే చాలు వారి మధ్య ఎదో ఉందన్న గుసగుసలు వినిపిస్తాయి. అయితే ఇవన్నీ తట్టుకుని మంచి స్నేహితులుగా ఉన్న జోడీలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు మనకు. వారిలో నిత్య మీనన్, మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒకరు.

వీరిద్దరూ కలిసి దాదాపు ఐదు సినిమాల్లో నటించారు. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే బంగారం’ తెలుగులోను డబ్ చేసారు. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు కూడా ఎక్కువే. అయితే నిజ జీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితులు. తాజాగా నిత్యా మీనన్ దుల్కర్ తో స్నేహం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదని కానీ దుల్కర్ నన్ను చాలా సార్లు పెళ్లి చేసుకోమని కోరాడని, పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేసాడని తెలిపింది.

పెళ్లి తర్వాత జీవితంలో వచ్చే మార్పుల గురించి అతను చెప్తుంటే నిజంగానే నాకు కూడా పెళ్లి పై ఆసక్తి కలిగింది. దుల్కర్ ఓ కుటుంబ సభ్యుడిలా నా గురించి ఆలోచిస్తాడు. అని తెలిపింది. కాగా మలయాళం అగ్ర హీరో మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Related News