logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

‘రంగ్ దే’ మూవీ రివ్యూ: నితిన్ కు ఈసారైనా హిట్టు దక్కిందా?

గతేడాది వచ్చిన భీష్మ సినిమా హిట్టుతో జోరుమీదున్న నితిన్ కు ఇటీవల విడుదలైన చెక్ సినిమా చెక్ పెట్టింది. చంద్రశేకర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమా నిరాశపరచడంతో రంగ్ దే సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. గతంలో తోలిప్రేమ, మజ్ను సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. కీర్తి సురేష్ మొదటిసారి నితిన్ తో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లతో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రంగ్ దే ను ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ:
అర్జున్ (నితిన్), అను (కీర్తిసురేష్) పక్కపక్క ఇళ్లలోనే ఉండే బద్ద శత్రువులు. చిన్ననాటి నుంచి ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూనే ఉంటారు. పెద్దైనా వీళ్ళ మధ్యన గొడవలు ఆగవు. కానీ పెరిగి పెద్దయిన కొద్దీ అనుకు అర్జున్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అర్జున్ కి మాత్రం అనుపై కోపం అలాగే ఉంటుంది. ఊహించని పరిస్థితుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోవలసి వస్తుంది. ఆ తర్వాత వీరిద్దరూ ఎలా కలిసి జీవించారు? వీళ్ల బలవంతపు పెళ్లి వెనుక కారణం ఏమిటి? చివరకు ఈగోను పక్కన పెట్టి ఒక్కటయ్యారా లేదా అనే విషయం తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
మూడో సినిమాగా ఒక మంచి యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సెలక్ట్ చేసుకుని సక్సెసయ్యాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మొదటిసారి జోడీ కట్టిన నితిన్ కీర్తిల పెరఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అదంతగా వర్కౌట్ కాలేదు. నితిన్ ఫన్నీ డైలాగ్స్ మ్యానరిజమ్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. కీర్తి నితిన్ ల మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ ఫైట్ బాగుంటాయి. ఎమోషనల్ సీన్స్ లో కీర్తి నటన సూపర్బ్ అనేలా ఉంటుంది. సినిమాలో స్లో నేరేషన్ కాస్త విసుగు పుట్టిస్తుంది. అయితే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచేస్తుంది. హీరో హీరోయిన్ల్ మధ్య వచ్చే ఏమోషనల్ సన్నివేశాలు అంత కన్విన్సింగ్గా లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా ఫ్యామిలీతో సహా సినిమా చూడాలనుకునేవారికి రంగ్ దే మంచి ఆప్షన్ గా చెప్పచ్చు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ సంగీతం సినిమాకు మేయర్ హైలెట్ గా నిలిచాయి. హీరో ఫాదర్ గా సీనియర్ హీరో నరేష్ నటన నవ్వులు పూయిస్తుంది. రోహిణి, సుహాస్, అభినవ్, వెన్నెల కిషోర్ పాత్రలు పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్స్:
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. ముందు చెప్పుకున్నట్టుగానే నితిన్- కీర్తి సురేష్ ల కాంబినేషన్ ఆకట్టుకుంటుంది. వారిద్దరి నటన, కామెడీ సన్నివేశాలు, మ్యూజిక్ సినిమాలో ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే… తెలిసిన కథే కావడం, సాగదీత సీన్లు, లీడ్ రోల్స్ మధ్య వర్కౌట్ కానీ ఎమోషనల్ సీన్లు రంగ్ దే సినిమాకు మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

మొత్తంగా చూసుకుంటే రంగ్ దే సినిమాకు 3/5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News