గతేడాది ‘భీష్మ’ సినిమాతో హిట్టందుకున్న నితిన్ తాజాగా ‘రంగ్ దే’తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ తో బాలీవుడ్ రీమేక్ సినిమా ‘మ్యాస్ట్రో’తో వస్తున్నాడు. మ్యాస్ట్రో సినిమా తర్వాత వక్కంతం వంశీతో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ట్యాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఆమెకు వినిపించారట. అయితే ఈ సినిమాకు సాయి పల్లవి ఒకే చెప్తుందా అనే విషయం పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
ఎందుకంటే గతంలో నితిన్ నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారు. హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆ సినిమాకు నో చెప్పిందట ఈ మలయాళీ బ్యూటీ. ఆ తర్వాత రాశికన్నా ను ఎంచుకున్నారు. కథ నచ్చితే రెమ్యునరేషన్ ను సైతం పక్కన పెట్టి నటించే సాయి పల్లవి నచ్చకుంటే మాత్రం నిర్మొహమాటంగా ఆ సినిమాను తిరస్కరిస్తుంది.
ఆ మధ్యన తెలుగులో ఆఫర్లు తగ్గాయన్న రూమర్లు వచ్చినా ఇప్పుడు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుంది. శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాలో ‘సారంగ దరియా’ పాటతో మరోసారి టాలీవుడ్ లో తన స్థానం ఏమిటో నిరూపించుకుంది. మరోవైపు రానాతో ‘విరాటపర్వం’, నానితో ‘శ్యామ్ సింగరాయ’ సినిమాలతో బిజీగా ఉంది. నితిన్ సినిమాకు సాయి పల్లవి ఈసారైనా ఒకే చెప్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ ను తెరపై చూడాలని నితిన్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.