logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

నన్ను అలా చూసి నా భార్య కంగారు పడింది: నితిన్ షాకింగ్ కామెంట్స్

నితిన్ చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విభిన్న సినిమాలకు కేరాఫ్ అయిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను అప్పుడే సినిమా యూనిట్ ప్రారంభిందింది. హీరో నితిన్ ఇటీవల చెక్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి నితిన్ ను సరదాగా ఇంటర్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరో నితిన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చెక్ నా కెరీర్ లో చాలా విభిన్నమైన సినిమా. ఈ సినిమా 80 శాతం జైలులోనే ఉంటుంది. చెక్ సినిమా కోసం శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా సిద్దమవ్వాల్సి వచ్చింది. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ పాత్రలో నుంచి బయటకు రాలేక ముభావంగా ఉండేవాడిని.

అది చూసి నా భార్య షాలిని ఏమైంది ఆయనకు అలా ఉంటున్నారని కంగారు పడిందని చెప్పుకొచ్చాడు నితిన్. ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్ల నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సిమ్రాన్ చౌదరి, ప్రియా ప్రకాష్ వారియర్లు నటిస్తున్నారు. హీరోయిన్ రకుల్ గురించి నితిన్ మాట్లాడుతూ. రకుల్ కమర్షియల్ హీరోయిన్. చెక్ సినిమాలో ఆమె లాయర్ గా కనిపిస్తుంది. ఈ పాత్ర చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఒక కమర్షియల్ హీరోయిన్ అయినప్పటికీ చెక్ సినిమా లోని పాత్రను రకుల్ ఒకే చేయడం నాకు చాలా షాకింగ్ గా అనిపించిది ని నితిన్ చెప్పుకొచ్చాడు.

Related News