logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?

నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, సాయి చంద్, మురళి శర్మ, సంపత్ రాజ్, పోసాని తదితరులు
రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
సంగీతం: కళ్యాణ్ మాలిక్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్

‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న హీరో నితిన్ ఈ ఏడాది చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మనమంతా’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో విడుదలకు ముందే చెక్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం ..

కథ:
టెర్రరిస్టులకు సహాయం చేసి దేశద్రోహానికి పాల్పడిన కేసులో ఆదిత్య (నితిన్) కు కోర్టు జీవిత ఖైదు విదిస్తుంది. ఇక తన జీవితం జైలు గోడల మధ్యే అని ఆదిత్య ఫిక్స్ అయిపోతాడు. ఈ క్రమంలో అనుకోని విధంగా లాయర్ మానస అతని జీవితంలోకి వస్తుంది. ఆమె రాకతో ఆదిత్య జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. కొని అనూహ్య పరిస్థితుల్లో మానస ఈ కేసును టేకప్ చేయవలసి వస్తుంది. దీంతో ఆదిత్య తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆమెతో పంచుకుంటాడు. ఈ నేపథ్యంలో ఒక చెస్ ప్లేయర్ అయిన ఆదిత్య కు టెర్రరిస్టులకు సంబంధం ఏమిటి? ఆదిత్య గతం ఏమిటి? చివరకు జీవితఖైదు నుంచి తప్పించుకోగలిగాడా లేదా? అనేది ఈ సినిమాలోని మిగిలిన కథ.

విశ్లేషణ:
గతంలో చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు చూసిన వారికి ఈ దర్శకుడి మేకింగ్ స్టైల్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు. చెక్ సినిమా కూడా చంద్రశేఖర్ ఏలేటి గత సినిమాలలాగానే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్టులు సినిమాను ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. సెకండ్ హాఫ్ లో సినిమా స్లో అవుతుందని అనుకునేలోపే క్లైమాక్స్ తో ప్రేక్షకులకు మంచి సినిమా చూశామన్న భావన కలుగజేస్తాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచింది. స్క్రీన్ ప్లే కారణంగా సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కళ్యాణ్ మాలిక్ అందించిన అద్భుతమైన గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసేవిధంగా ఉన్నాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్త నితిన్ కనిపిస్తాడు. ఇప్పటివరకు లవ్, యాక్షన్, డ్రామా సినిమాలు చేసిన నితిన్ మొదటిసారిగా తన స్టైల్ మార్చుకున్నాడు. చెక్ సినిమాలో అతని నటన భిన్నంగా ఉంటుంది. హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ తన పరిధి మేరకు నటించి పరవాలేదనిపించింది. లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. నటుడు సాయి చంద్ క్యారెక్టర్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఇక మిగిలిన పాత్రధారులు కూడా బాగానే నటించారు. థ్రిల్లర్ కథాంశం కావడంతో రన్ టైం తక్కువగా ఉంది. పంచు డైలాగులు, ఫైట్లు లాంటి కమర్షియల్ సినిమాలకు చెక్ సినిమా పూర్తి భిన్నంగా సాగుతుంది. అలాంటి సినిమాలతో బోర్ కొట్టిన ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
చెక్ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. కొత్త కథ, నితిన్ నటన, చంద్రశేఖర్ ఏలేటి మార్కు స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్ చూస్తే.. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ లో సినిమా లేకపోవడం, కమర్షియల్ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం వంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

రేటింగ్:
ఫైనల్ గా చెక్ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News