logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

నితిన్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల..!

కొంత కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న హీరో నితిన్ ను గతేడాది ‘భీష్మ’ సినిమాతో విజయం పలకరించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలతో బిజీగా మారాడు నితిన్. ‘మనమంతా’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన తర్వాత దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి నితిన్ కాంబినేషన్లో సినిమా రావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కాబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ‘చెక్’.

ఈ సినిమాలో నితిన్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తుంది. కొద్దిసేపటి క్రితమే చెక్ సినిమా గింప్స్ ను సినిమా టీమ్ విడుదల చేసారు. ఇందులో నితిన్ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తూ ఉగ్రవాదిగా గుర్తించబడిన ఖైదీగా నితిన్ కనిపిస్తున్నాడు. ఆదిత్యగా నితిన్ ఆహార్యం విభిన్నంగా ఉంది.

‘జైలులో ఓ ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’ అంటూ ఓ వ్యక్తి చెప్పగా ‘అద్భుతంగా అంటే?’ అని మరో వ్యక్తి ప్రశిస్తాడు. విశ్వనాథ్‌ ఆనంద్‌, కస్పరోవ్‌ లాగా’ అని సమాధానం ఇస్తాడు. అతను అమాయకుడంటూ హీరోయిన్ రకుల్ చెప్తుంది. డైలాగులతో సినిమా పై క్యూరియాసిటీని పెంచే విధంగా ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ ను ప్లాన్ చేసారు సినిమా టీమ్. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే ప్రమోషన్ కూడా మొదలు పెట్టేసారు. మరి వీరిద్దరికంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.

Related News