logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బాలీవుడ్ కు ‘భీష్మ’.. నితిన్ పాత్రలో ఆ యంగ్ హీరో..!

సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో విజయం సాధించిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం అనే సంప్రదాయం ఎప్పటినుండో ఉన్నదే. తాజాగా నితిన్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా పై ఇప్పుడు బాలివుడ్ కన్ను పడింది. బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు.

ఈ సినిమా రీమేక్ రైట్స్ కు కూడా మంచి ధర పలికిందని తెసులుస్తుంది. అయితే సినిమా మొత్తం తన కామెడీ టైమింగ్ తో నడిపించాడు నితిన్. సినిమా విజయం సాధించడానికి ముఖ్య కారణం నితిన్ కామెడీ టైమింగ్. మరి ఇప్పుడు నితిన్ ప్లేస్ లో ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. తాజాగా భీష్మ రీమేక్ లో రణ్ బీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం. రణ్ బీర్ కు జోడీగా ఎవరు కనిపిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక భీష్మ సినిమా నితిన్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నితిన్ త్వరలోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను, ‘తొలి ప్రేమ’ ఫెమ్ వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Related News